ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PBKSvsGT: టాస్ అనంతరం ధవన్‌కు హార్దిక్ ముద్దు.. ఇద్దరూ ఎలాంటి స్నేహితులంటే..

ABN, First Publish Date - 2023-04-14T08:09:07+05:30

గత మ్యాచ్‌లో చివరి క్షణంలో మ్యాచ్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ గురువారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎలాంటి తప్పూ చేయలేదు. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించి సునాయాసంగా విజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

గత మ్యాచ్‌లో చివరి క్షణంలో మ్యాచ్ కోల్పోయిన గుజరాత్ టైటాన్స్ (GT) గురువారం పంజాబ్ కింగ్స్‌తో (PBKS) జరిగిన మ్యాచ్‌లో ఎలాంటి తప్పూ చేయలేదు. మ్యాచ్ ఆసాంతం ఆధిపత్యం ప్రదర్శించి సునాయాసంగా విజయం సాధించింది. పంజాబ్‌పై (PBKSvsGT) ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. కేకేఆర్‌తో (KKR) మ్యాచ్‌కు దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అయితే బౌలింగ్‌కు మాత్రం దూరంగా ఉన్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ వేసేందుకు పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధవన్‌తో (Shikhar Dhawan) కలిసి హార్దిక్ మైదానంలోకి వెళ్లాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ అనంతరం ఇద్దరూ కలిసి ముచ్చటించుకున్నారు. తన స్నేహితుడు ధవన్‌ను హార్దిక్ కౌగిలించుకుని ముద్దు పెట్టుకున్నాడు. టీమిండియా తరఫున ఆడేటపుడు ఇద్దరూ విదేశాల్లో కలిసి తిరిగేవారు. హార్దిక్, ధవన్ మంచి స్నేహితులు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో (IPL 2023) ధవన్ టాప్ స్కోరర్‌గా ఉన్నాడు.

Rohit Sharma: ``మీరు కర్మను నమ్ముతారు.. మేం శర్మను నమ్ముతాం..`` ఆర్సీబీకి ముంబై ఇండియన్స్ కౌంటర్!

గతేడాది ఛాంపియన్ అయిన గుజరాత్ ఈ సీజన్‌లో కూడా ఫామ్ కొనసాగిస్తూ విజయాలతో దూసుకుపోతోంది. మరోవైపు ధవన్ సారథ్యంలోని పంజాబ్ టీమ్ తడబడుతోంది. ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో 2 గెలిచి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది. ధవన్ తప్ప పంజాబ్ టీమ్‌లోని మిగతా ఆటగాళ్లు విఫలమవుతున్నారు.

Updated Date - 2023-04-14T08:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising