Hardik Pandya: గేరు మార్చిన హార్దిక్ పాండ్యా.. ఒకే ఓవర్లో మూడు సిక్స్‌లు.. వీడియో వైరల్!
ABN, First Publish Date - 2023-05-06T08:42:20+05:30
హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ (IPL 2023) ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తోంది. బౌలర్లు, టాపార్డర్ బ్యాటర్లు దుమ్మురేపడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను మట్టికరిపించింది.
హార్దిక్ పాండ్యా (Hardik Pandya) నాయకత్వంలోని డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) ఐపీఎల్ (IPL 2023) ప్లేఆఫ్స్ రేసులో దూసుకెళ్తోంది. బౌలర్లు, టాపార్డర్ బ్యాటర్లు దుమ్మురేపడంతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను (RR) మట్టికరిపించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 17.5 ఓవర్లలో 118 పరుగులకు కుప్పకూలింది. శాంసన్ (Sanju Samson) (30) కాస్త ఫర్వాలేదనిపించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ ఆ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది.
స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ 13.5 ఓవర్లలో 119/1 స్కోరు చేసి అలవోకగా ఛేదించింది. పాండ్యా (39 నాటౌట్), సాహా (41 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (36) ధాటిగా ఆడడంతో 13.5 ఓవర్లలోనే గుజరాత్ విజయం అందుకుంది. మిగిలి ఉన్న బంతుల పరంగా చూసుకుంటే ఈ సీజన్‌లో ఇదే పెద్ద విజయం కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సత్తా చాటాడు. బౌలింగ్‌లో ఒక వికెట్ పడగొట్టి, ఛేజింగ్‌లో 39 పరుగులు చేశాడు. అటు నాయకుడిగానూ ఆకట్టుకున్నాడు.
Yashaswi Jaiswal: యశస్వి జైస్వాల్ రనౌట్.. సంజూ శాంసన్‌పై విమర్శలు.. వీడియో వైరల్!
ముఖ్యంగా ఆడమ్ జంపా ( Adam Jampa) వేసిన ఓవర్లో హార్దిక్ పాండ్యా బ్యాట్ ఝుళిపించాడు. అప్పుడే శుభ్‌మన్ గిల్ అవుట్ కావడంతో పరుగులు కాస్త నెమ్మదించాయి. దీంతో జంపా వేసిన 11వ ఓవర్లో పాండ్యా చెలరేగాడు. ఆ ఓవర్లో మొత్తం మూడు సిక్స్‌లు, 1 ఫోర్ కొట్టి 24 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ విజయం దాదాపు ఖరారైపోయింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
Updated Date - 2023-05-06T08:42:20+05:30 IST