ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Harry Brook: అభిమానులపై హ్యారీ బ్రూక్ వెకిలి వ్యాఖ్యలు.. తిప్పి కొడుతున్న నెటిజన్లు!

ABN, First Publish Date - 2023-04-15T12:33:51+05:30

హ్యారీ బ్రూక్.. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక విమర్శలు ఎదుర్కొన్న ఆటగాడు. హైదరాబాద్ టీమ్ ఈ యువ ఆటగాడి కోసం ఏకంగా రూ.13.25 కోట్లు పెట్టింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

హ్యారీ బ్రూక్ (Harry Brook).. ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక విమర్శలు ఎదుర్కొన్న ఆటగాడు. హైదరాబాద్ టీమ్ (SRH) ఈ యువ ఆటగాడి కోసం ఏకంగా రూ.13.25 కోట్లు పెట్టింది. టెస్ట్‌ల్లోనూ, ఇతర లీగ్‌ల్లోనూ పరుగుల వరద పారించడంతో బ్రూక్ కోసం అంత ఖర్చు పెట్టేందుకు సన్‌రైజర్స్ యాజమాన్యం సిద్ధమైంది. అయితే బ్రూక్ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంలో విఫలమయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు మొదలయ్యాయి. ఇండియన్ పిచ్‌లపై బ్రూక్ ఓ సాధారణ ఆటగాడేనని మాజీలు కూడా విమర్శంచారు.

ఆ విమర్శలన్నింటికీ బ్రూక్ తన బ్యాట్‌తో సమాధానం చెప్పాడు. శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో (KKRvsSRH)జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ చెలరేగి ఆడి ఈ సీజన్‌లో తొలి శతకం సాధించిన ఆటగాడిగా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ భారత అభిమానులపై కాస్త వెకిలిగా మాట్లాడాడు (Harry Brook Fires on Indian Fans). ``నేను ఈ రోజు అద్భుతంగా ఆడానని చాలా మంది ఇండియన్ ఫ్యాన్స్ ప్రశంసించారు. కానీ, కొన్ని రోజుల ముందు వారే నన్ను విమర్శించారు. వాళ్లందరి నోళ్లూ మూయించినందుకు సంతోషంగా ఉంద``ని బ్రూక్ వ్యాఖ్యానించాడు.

Virender Sehwag: శుభ్‌మన్ గిల్ టీమ్ కోసం ఆడడం లేదు.. యువ ఆటగాడిపై డాషింగ్ ఆటగాడి విమర్శలు!

బ్రూక్ వ్యాఖ్యలపై కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. బ్రూక్ చాలా పొగరుగా మాట్లాడాడని కామెంట్లు చేస్తున్నారు. ``ఎవ్వరూ విమర్శలకు అతీతం కాదు. నీ కోసం బోల్డెంత డబ్బు ఖర్చు పెట్టారు. నువ్వు ఆడాల్సిందే. అభిమానులను గౌరవించడం నేర్చుకో. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా బాగా ఆడి అప్పుడు అలాంటి స్టేట్‌మెంట్లు ఇవ్వాల``ని ఒకరు కామెంట్ చేశారు. ``ఒక్క మ్యాచ్‌లో బాగా ఆడినంత మాత్రాన అభిమానులను చులకనగా చూడడం సరికాదు. అభిమానులే లేకపోతే క్రికెటర్లు, సెలబ్రిటీలు ఉండరు. అభిమానులు చూడకపోతే నువ్వు ఆడే ఐపీఎల్ కూడా ఉండద``ని మరొకరు కామెంట్ చేశారు.

Updated Date - 2023-04-15T12:33:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising