హోటల్ గదుల రేట్లు పైపైకి..
ABN, First Publish Date - 2023-10-02T02:15:50+05:30
భారత్‌లో జరుగబోయే వన్డే వరల్డ్‌క్‌పను వీక్షించేందుకు అభిమానులు తెగ ఉత్సాహం చూపుతున్నారు. ఈమేరకు ఆయా నగరాల్లో ముందస్తుగా తమ వసతి కోసం హోటళ్లలో బుకింగ్స్ చేసుకుంటున్నారు...
వన్డే వరల్డ్‌కప్ ప్రభావం
న్యూఢిల్లీ: భారత్‌లో జరుగబోయే వన్డే వరల్డ్‌క్‌పను వీక్షించేందుకు అభిమానులు తెగ ఉత్సాహం చూపుతున్నారు. ఈమేరకు ఆయా నగరాల్లో ముందస్తుగా తమ వసతి కోసం హోటళ్లలో బుకింగ్స్ చేసుకుంటున్నారు. కానీ మామూలు రోజులకన్నా రెండు, మూడింతలు పెరిగిన రేట్లు చూస్తేనే వారి దిమ్మ తిరుగుతోంది. అహ్మదాబాద్, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా, ధర్మశాలలో వసతి కోసం మేక్‌మైట్రిప్, ఓయో, యాత్ర ఆన్‌లైన్ సైట్లలో ఆక్యుపెన్సీ రేటు 60 శాతం పెరిగింది. ఇందులో ఓ మాదిరి నుంచి స్టార్ హోటళ్ల వరకున్నాయి. ముఖ్యంగా భారత్ మ్యాచ్‌లు జరిగే నగరాల్లో ఫ్యాన్స్‌కు వసతి లభించడం కష్టంగా మారింది. అహ్మదాబాద్‌లోనైతే హోటళ్లు, హాస్టళ్లలో రేట్లు ఆగస్టుతో పోలిస్తే 200 శాతం పెరిగాయి. ఈనెల 14న భారత్-పాక్ మ్యాచ్ ఇక్కడే జరుగనుంది. మరోవైపు మ్యాచ్ రోజుల్లో విమాన రేట్లు సైతం రెండు, మూడు రెట్లు పెరిగాయి.
Updated Date - 2023-10-02T02:15:50+05:30 IST