Yash Dayal: ఐదు బంతుల్లో ఐదు సిక్స్‌లు.. రింకూ బాధితుడు యశ్ దయాల్‌కు మద్దతు.. అతడి తండ్రి ఏమన్నారంటే..
ABN, First Publish Date - 2023-04-10T16:36:07+05:30
రాజస్థాన్ రాయల్స్ బౌలర్ యశ్ దయాల్ తండ్రి చంద్రపాల్ ప్రతిరోజూ దినపత్రిక చదివిన తర్వాతే తన రోజును ప్రారంభిస్తారు. అయితే సోమవారం ఉదయం మాత్రం ఆయన పేపర్ పట్టుకోవడానికి భయపడ్డారు.
గుజరాత్ టైటాన్స్ (GT) బౌలర్ యశ్ దయాల్ (Yash Dayal) తండ్రి చంద్రపాల్ ప్రతిరోజూ దినపత్రిక చదివిన తర్వాతే తన రోజును ప్రారంభిస్తారు. అయితే సోమవారం ఉదయం మాత్రం ఆయన పేపర్ పట్టుకోవడానికి భయపడ్డారు. ఆదివారం మ్యాచ్‌కు సంబంధించి తన కొడుకును విమర్శిస్తూ వార్తలు వస్తాయని ఊహించి పేపర్ చదవడానికి ఇష్టపడలేదు. ఆదివారం రాత్రి కేకేఆర్, గుజరాత్ టైటాన్స్ (KKRvsGT) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ చివరి బంతి తర్వాత రింకూ సింగ్ (Rinku Singh) ఇంట్లో సంబరాలు మిన్నంటితే.. యశ్ దయాల్ ఇంట్లో మాత్రం విషాదం తాండవించింది.
తన కొడుకు మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్నాడని తెలిసి చంద్రపాల్ రంగంలోకి దిగారు. మైదానంలో మ్యాచ్ చూస్తున్న తన భార్య, సోదరి, ఇతర బంధువులను వెంటనే టీమ్ బస చేస్తున్న హోటల్‌కు వెళ్లి యశ్‌తో మాట్లాడి అతడికి ధైర్యం చెప్పాలని సూచించారు. ఆ తర్వాత కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడారు. చంద్రపాల్ కూడా గతంలో ఫాస్ట్ బౌలర్‌గా ఉన్నారు. ``ఇలాంటిది క్రికెట్‌లో కొత్త కాదు. పెద్ద పెద్ద బౌలర్లకు కూడా గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. మలింగ, స్టువార్ట్ బ్రాడ్ వంటి బౌలర్లకు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యాయ``ని చంద్రపాల్ అన్నారు.
Shikhar Dhawan: ఇప్పుడు మీకు సంతోషమేనా? నవ్వుతూనే హర్షా భోగ్లేకు చురకలు అంటించిన ధవన్..
చంద్రపాల్ మాత్రమే కాదు.. గుజరాత్ టైటాన్స్ టీమ్ కూడా యశ్‌కు మద్దతుగా ట్వీట్ చేసింది. ``మనం కొన్నిసార్లు గెలుస్తాం.. కొన్నిసార్లు ఓడిపోతా. కానీ, మనమంతా ఒకటేన``ని గుజరాత్ ట్వీట్ చేసింది. ఇక, కేకేఆర్ (KKR) కూడా యశ్‌కు మద్దతు తెలిపింది. ``ఒక్కోసారి ప్రపంచ ఉత్తమ బౌలర్లకు కూడా ఇలా జరుగుతుంది. నువ్వు నిజంగా ఛాంపియన్‌వి. యశ్.. నువ్వు మరింత బలంగా, వేగంగా పుంజుకుంటావ``ని కేకేఆర్ టీమ్ ట్వీట్ చేసింది.
Updated Date - 2023-04-10T16:36:07+05:30 IST