ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఇంగ్లండ్‌ జట్టుకు భారత బౌలర్‌ సాయం

ABN, First Publish Date - 2023-10-12T04:17:28+05:30

సౌరభ్‌ కుమార్‌ అంబాత్కర్‌.. 39 ఏళ్ల ఈ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఇంగ్లండ్‌ జట్టు వరల్డ్‌ కప్‌ స్టార్లు జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌కు సాయం చేస్తున్నాడు...

న్యూఢిల్లీ: సౌరభ్‌ కుమార్‌ అంబాత్కర్‌.. 39 ఏళ్ల ఈ లెఫ్టామ్‌ స్పిన్నర్‌ ఇంగ్లండ్‌ జట్టు వరల్డ్‌ కప్‌ స్టార్లు జో రూట్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌కు సాయం చేస్తున్నాడు. 39 ఏళ్ల సౌరభ్‌ గతంలో ముంబై అండర్‌-16కి, తర్వాత విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక..సాటిలేని ఎడమ చేతి పేసర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, మిచెల్‌ స్టార్క్‌, ముస్తాఫిజుర్‌ రహ్మాన్‌లను సమర్థంగా ఎదుర్కోవడం ఎలా అని ఆలోచిస్తున్న ఇంగ్లండ్‌ కోచింగ్‌ బృందానికి సౌరభ్‌ కుమార్‌ తట్టాడు. ఐపీఎల్‌లో ఇటీవలి వరకు సౌరభ్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ (కేకేఆర్‌) సహాయ బృందంలో సేవలు అందించాడు. అలాగే యూఏఈ ఐఎల్‌ టీ20లో అబుధాబి నైట్‌రైడర్స్‌తో కలిసి పని చేశాడు. ఇంతకీ ఇంగ్లండ్‌ జట్టుతో అతడికి ఎలా పరిచయమంటే..ఆ జట్టు మేనేజర్‌ వేన్‌ బెంట్లీ కేకేఆర్‌తో సౌరభ్‌తోపాటు కలిసి పనిచేశాడు. దాంతో కుమార్‌ను అతడు ఇంగ్లండ్‌ వరల్డ్‌ కప్‌ జట్టుకు సేవలందించాలని కోరాడు. అంగీకరించిన సౌరభ్‌ ప్రపంచ కప్‌ అయ్యే వరకు ఆ జట్టు త్రోడౌన్‌ స్పెషలిస్టుగా వ్యవహరిస్తాడు.

Updated Date - 2023-10-12T04:17:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising