IPL 2023: ఈ ఐపీఎల్ సీజన్‌తో ఎంట్రీ ఇచ్చిన వాళ్లలో.. వేలంలో రూ. 13 కోట్లు పలికి 13 రన్స్ కొట్టిన మహానుభావుడు ఎవరంటే..
ABN, First Publish Date - 2023-04-03T13:14:45+05:30
హార్డ్ హిట్టర్ కామెరూన్ గ్రీన్ నుంచి యువ బౌలర్ రాజ్‌వర్ధన్ వరకు ఎందరో అంతర్జాతీయ, జాతీయ క్రికెటర్లు ఈ ఐపీఎల్ (IPL 2023)లో అరంగేట్రం చేశారు. వారిలో చాలా మంది ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను ఆడేశారు.
హార్డ్ హిట్టర్ కామెరూన్ గ్రీన్ (Cameron Green) నుంచి యువ బౌలర్ రాజ్‌వర్ధన్ (Rajvardhan Hangargekar) వరకు ఎందరో అంతర్జాతీయ, జాతీయ క్రికెటర్లు ఈ ఐపీఎల్ (IPL 2023)లో అరంగేట్రం చేశారు. వారిలో చాలా మంది ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌ను ఆడేశారు. అయితే అందులో కొందరు ఏ మాత్రం అంచనాలను అందుకోలేక చతికిలపడ్డారు. ఒక్క మ్యాచ్‌తోనే వారిని అంచనా వేయడం సరికాదు కానీ, ఇకపైనైనా వారు రాణించకలేకపోతే మాత్రం ఆయా జట్లకు ఇబ్బందులే.
సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ (SunRisers Hyderabad) ఏకంగా రూ.13 కోట్లు చెల్లించి ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీ బ్రూక్‌ను (Harry Brook) కొనుగోలు చేసింది. టీ-20 క్రికెట్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న ఈ యువ ఆటగాడిపై హైదరాబాద్ జట్టు చాలా ఆశలే పెట్టుకుంది. అయితే ఆదివారం రాజస్థాన్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో బ్రూక్ తీవ్రంగా నిరాశపరిచాడు. 21 బంతులు ఆడి కేవలం 13 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. తర్వాతి మ్యాచ్‌ల్లోనైనా బ్రూక్ రాణించాలని హైదరాబాద్ టీమ్ కోరుకుంటోంది.
Faf du Plessis: నాయనా డుప్లెసిస్.. నువ్వు క్రికెటర్‌వా.. సూపర్ మ్యాన్‌వా.. ఆ కసి చూస్తుంటే ఆర్‌సీబీ ఈసారి కప్పు కొట్టేలానే ఉందిగా..!
బ్రూక్ మాత్రమే కాదు.. ఈ ఐపీఎల్‌లో కామెరూన్ గ్రీన్ (ఆస్ట్రేలియా), రహ్మానుల్లా (అఫ్గానిస్థాన్), జోష్ లిటిల్ (ఐర్లాండ్), సికిందర్ రజా (జింబాబ్వే), నేహల్ వదేరా (భారత్), రీస్ టోప్లే (ఇంగ్లండ్), రాజ్‌వర్థన్ (భారత్), కైల్ మేయర్స్ (వెస్టిండీస్) మొదలైన యువ ఆటగాళ్లు అరంగేట్రం చేశారు. వీరిలో ఎవరు స్టార్ ప్లేయర్లుగా మారతారో చూడాలి.
Updated Date - 2023-04-03T13:14:45+05:30 IST