ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

IPL 2023: ఒక్క వికెట్‌కే ఎంత హంగామా చేసిందో చూడండి... ఇంతకీ ఎవరామె? ఆమె గురించి తెలుసుకుంటే..

ABN, First Publish Date - 2023-04-08T08:51:41+05:30

పాపం.. వేదికలు మారినా, ఆటగాళ్లు మారినా, సీజన్లు మారినా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మాత్రం మారడం లేదు. గత సీజన్ల పేలవ ప్రదర్శనను హైదరాబాద్ టీమ్ ఈ సీజన్‌లోనూ కొనసాగిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

పాపం.. వేదికలు మారినా, ఆటగాళ్లు మారినా, సీజన్లు మారినా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఆటతీరు మాత్రం మారడం లేదు. గత సీజన్ల పేలవ ప్రదర్శనను హైదరాబాద్ టీమ్ ఈ సీజన్‌లోనూ కొనసాగిస్తోంది. కెప్టెన్ మార్‌క్రమ్ (Aiden Markram) వచ్చినా జట్టు ప్రదర్శనలో తేడా రాలేదు. మార్‌క్రమ్ ఎదుర్కొన్న తొలి బంతికే క్లీన్ బౌల్డ్ అయి వెనుదిరిగాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్ల కంటే ఆ జట్టు సహ యజమాని కవియా మారన్‌ (Kaviya Maran) బాగా హైలెట్ అయింది.

హైదరాబాద్ టీమ్ ఎక్కడ మ్యాచ్ ఆడితే అక్కడకు వెళ్లి టీమ్‌ను ఎంకరేజ్ చేయడంలో కవియా ఎప్పుడూ ముందుంటుంది. అయితే హైదరాబాద్ బాగా ఆడినపుడు గ్యాలరీలో ఆమె చేసుకునే సెలబ్రేషన్స్ మాత్రం ప్రేక్షకులకు కొంచెం అతిగా అనిపిస్తాయి. తాజాగా శుక్రవారం లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో హైదరాబాద్ టీమ్ తలపడింది (SRHvsLSG). తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ టీమ్ నానా కష్టాలు పడి 20 ఓవర్లలో కేవలం 121 పరుగులు మాత్రమే చేసింది.

Viral Video: అమిత్ మిశ్రా సూపర్ క్యాచ్.. 40 ఏళ్ల వయసులోనూ డైవింగ్ క్యాచ్ తీసుకోవడంపై నెటిజన్ల ప్రశంసలు..!

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూ టీమ్ ఓపెనర్ కైల్ మేయర్స్ (Kyle Mayers) త్వరగా అవుటయ్యాడు. ఇంపాక్ట్ ప్లేయర్ ఫరూకీ వేసిన బంతిని ఆడిన మేయర్స్ మయాంక్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మేయర్స్ వికెట్ పడినపుడు కవియా సంతోషం పట్టలేకపోయింది. కుర్చీ నుంచి పైకి లేచి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకుంది (Kaviya Maran Celebrations). అయితే ఆమె ఆనందం ఎంతో సేపు నిలవలేదు. లక్ష్యం చిన్నది కావడంతో లఖ్‌నవూ టీమ్ ఆచితూచి ఆడి విజయం సాధించింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుటుంబానికి చెందిన మురుసోలి మారన్ మనవరాలు, కళానిధి మారన్ కూతురే ఈ కవియా మారన్. 30 ఏళ్ల కవియాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.

Updated Date - 2023-04-08T08:51:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising