KL Rahul: రాహుల్ ఉంటే ప్రత్యర్థి జట్టుకే లాభం.. చెత్త బ్యాటింగ్ అంటూ నెటిజన్ల దారుణ ట్రోలింగ్!
ABN, First Publish Date - 2023-04-23T12:38:48+05:30
కారణమేంటో తెలియదు కానీ.. సోషల్ మీడియా జనాలకు క్రికెటర్ కేఎల్ రాహుల్ తరచుగా టార్గెట్ అవుతుంటాడు. అతడు ఏ చిన్న తప్పు చేసినా విమర్శించడానికి నెటిజన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాజాగా రాహుల్‌పై సోషల్ మీడియా జనం దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు.
కారణమేంటో తెలియదు కానీ.. సోషల్ మీడియా జనాలకు క్రికెటర్ కేఎల్ రాహుల్ (KL Rahul) తరచుగా టార్గెట్ అవుతుంటాడు. అతడు ఏ చిన్న తప్పు చేసినా విమర్శించడానికి (Trolling on KL Rahul) నెటిజన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాజాగా రాహుల్‌పై సోషల్ మీడియా జనం దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. సులభంగా గెలవాల్సిన మ్యాచ్‌ను రాహుల్ ప్రత్యర్థి టీమ్‌కు అప్పగించాడని నెటిజన్లు ఆడిపోసుకుంటున్నారు. శనివారం గుజరాత్ టైటాన్స్‌తో (GTvsLSG) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ 7 పరుగుల తేడాతో ఓడిపోయింది.
నిజానికి ఈ మ్యాచ్‌లో రాహుల్ బాగానే బ్యాటింగ్ చేశాడు. 68 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అయితే చివర్లో అనవసరంగా ఒత్తిడి ఫీలై చేజేతులా తన జట్టును ఓడించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 134 పరుగుల స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఛేజింగ్‌ను లక్నో టీమ్ మెరుగ్గానే ప్రారంభించింది. టాపార్డర్ రాణించడంతో లక్నో 15వ ఓవర్లలో 106/2తో పటిష్టంగానే ఉంది. రాహుల్ అప్పటికే హాఫ్ సెంచరీ చేశాడు. ఐదు ఓవర్లలో మరో 29 పరుగులు చేస్తే లక్నోదే విజయం. అయితే 16వ ఓవర్ నుంచి మ్యాచ్ తారుమారు అయింది.
Rohit Sharma: ముంబై కెప్టెన్ అరుదైన రికార్డు.. ఐపీఎల్‌లో ఆ ఘనత సాధించిన తొలి భారత క్రికెటర్..!
లేనిపోని ఒత్తిడి ఫీలై రాహుల్ చాలా నెమ్మదిగా ఆడాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన రాహుల్.. ఆ తర్వాత 18 పరుగులు చేయడానికి 23 బంతులు ఆడాడు. కచ్చితంగా గెలిపిస్తాడనుకుంటే చివరి ఓవర్ రెండో బంతికి అవుటై విజయంపై నీళ్లు జల్లాడు. దీంతో రాహుల్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. ``రాహుల్ లక్నో తరఫున ఆడడం లేదు. ప్రత్యర్థి టీమ్ తరఫున 12వ ఆటగాడిగా ఆడుతున్నాడు``, ``టీ-20 క్రికెట్‌లో రాహుల్ కంటే చెత్త బ్యాట్స్‌మెన్ ఎవరూ ఉండరు``, ``రాహుల్ త్వరగా ఔట్ అయి ఉంటే లక్నో గెలిచేది`` అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-04-23T12:38:48+05:30 IST