ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PBKSvsLSG: కేఎల్ రాహుల్ పట్టిన ఈ క్యాచ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2023-04-16T08:37:15+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో మాత్రమే కాదు ఫీల్డింగ్‌లో కూడా సత్తా చాటుతూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. నమ్మశక్యం కాని క్యాచ్‌లను అందుకుని మ్యాచ్‌లను మలుపు తిప్పుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో (IPL 2023) ఆటగాళ్లు బ్యాటింగ్, బౌలింగ్‌లో మాత్రమే కాదు ఫీల్డింగ్‌లో కూడా సత్తా చాటుతూ అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. నమ్మశక్యం కాని క్యాచ్‌లను (Catches) అందుకుని మ్యాచ్‌లను మలుపు తిప్పుతున్నారు. యువ ఆటగాళ్లే కాదు.. సీనియర్ ప్లేయర్లు కూడా కళ్లు చెదిరే క్యాచ్‌లు అందుకుంటున్నారు. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) అందుకున్న క్యాచ్ చూస్తే ``వావ్`` అనకుండా ఉండలేరు. పంజాబ్ కింగ్స్ లెవన్‌తో (PBKS) శనివారం జరిగిన మ్యాచ్‌లో రాహుల్ డైవ్ చేసి సూపర్ క్యాచ్ అందుకున్నాడు.

శనివారం జరిగిన మ్యాచ్‌లో (PBKSvsLSG) టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లఖ్‌నవూకు ఓపెనర్లు రాహుల్‌, మేయర్స్‌ తొలి వికెట్‌కు 53 రన్స్‌తో శుభారంభం అందించారు. అయితే తర్వాతి బ్యాట్స్‌మెన్ ఆ దూకుడు కొనసాగించలేకపోవడంతో లఖ్‌నవూ టీమ్ 159 పరుగులకే పరిమితమైంది. 160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పంజాబ్ ఆరంభంలో త్వరగా వికెట్లు కోల్పోయింది. పంజాబ్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో మార్క్ వుడ్ వేసిన బంతిని జితేష్ శర్మ (Jitesh Sharma) మిడ్-ఆఫ్ మీదుగా కొట్టాడు. అక్కడ ఉన్న రాహుల్ తన ఎడమ వైపునకు ఫుల్-లెంగ్త్ డైవ్ చేసి అద్భుతంగా క్యాచ్ (Super Catch) అందుకున్నాడు.

Kohli vs Ganguly: గంగూలీ వైపు కోపంగా చూస్తూ వెళ్లిపోయిన కోహ్లీ.. చేయి కలిపేందుకు నిరాకరించిన దాదా!

సెకెన్ల వ్యవధిలో రియాక్ట్ అయి అమాంతం గాల్లోకి ఎగురుతూ రాహుల్ పట్టిన క్యాచ్ క్రికెట్ ప్రేమికులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. రాహుల్ ఫీల్డింగ్ నైపుణ్యాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పంజాబ్ టీమ్ 2 వికెట్ల తేడాతో లఖ్‌నవూపై విజయం సాధించింది.

Updated Date - 2023-04-16T08:37:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising