IPL 2023: ఐపీఎల్‌కు గాయాల బెడద.. సీజన్ మొత్తానికి దూరమైన కీలక ఆటగాళ్లు..
ABN, First Publish Date - 2023-04-07T11:03:02+05:30
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్ ప్రారంభమై వారం రోజులు పూర్తవుతున్నాయి. దాదాపు అన్ని దేశాల ఆటగాళ్లు లీగ్‌లో పాల్గొని సత్తా చాటుతున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్ ప్రారంభమై వారం రోజులు పూర్తవుతున్నాయి. దాదాపు అన్ని దేశాల ఆటగాళ్లు లీగ్‌లో పాల్గొని సత్తా చాటుతున్నారు. అయితే కొందరు కీలక ఆటగాళ్లు మాత్రం గాయాల కారణంగా పూర్తిగా లీగ్‌కే (Injured Players in IPL) దూరమై అటు యాజమాన్యాన్ని, ఇటు ప్రేక్షకులను నిరాశకు గురి చేశారు. వారి స్థానాల్లో కొందరు కొత్త ఆటగాళ్లను కూడా ఫ్రాంఛైజీలు తీసుకున్నాయి.
గుజరాత్ టైటాన్స్ (GT) స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) తొలి మ్యాచ్‌లోనే తీవ్రంగా గాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్‌లో డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ వద్ద క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో విలియమ్సన్ పడిపోయాడు. దాంతో అతడి మోకాలికి గాయమైంది. దీంతో అతడు ఈ ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఐపీఎల్‌కు మాత్రమే కాదు.. వచ్చే ప్రపంచకప్‌లో కూడా విలియమ్సన్ ఆడడం లేదు. అతడు అర్జెంటుగా మోకాలి సర్జరీ చేయించుకోనున్నాడు.
KKR vs RCB: షారుక్ వచ్చాక ఇక తగ్గేదేలే.. ఈడెన్‌లో రెచ్చిపోయిన కోల్‌కతా టీమ్.. వైరల్ అవుతున్న ఫొటోలు!
ఇక ఆర్సీబీ కీలక బౌలర్ రీస్ టాప్లీ (Reece Topley) కూడా గాయంతో వెనుదిరిగాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా టాప్లీ భుజానికి గాయం అయింది. దీంతో అతడు ఈ సీజన్ మొత్తానికి దూరం అయ్యాడు. ఇక, జస్ప్రీత్ బుమ్రా, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు సీజన్ ప్రారంభానికి ముందే గాయాలపాలయ్యారు. వీరు మాత్రమే కాకుండా విల్ జాక్స్ (RCB), జానీ బెయిర్‌స్టో (PBKS), కైల్ జేమీసన్ (CSK), ప్రసిధ్ కృష్ణ (RR), ముఖేష్ చౌదరి (CSK), షకీబ్ అల్ హసన్ (KKR) వంటి స్టార్ ప్లేయర్స్ గాయాల కారణంగా ఈ ఐపీఎల్ నుంచి వైదొలిగారు.
Updated Date - 2023-04-07T11:03:02+05:30 IST