RCB vs LSG: బెంగళూరు ఫ్యాన్స్‌పై గంభీర్ అసహనం.. సైలెన్స్ అంటూ సంజ్ఞలు.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2023-04-11T08:39:30+05:30

అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ అనూహ్య విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది.

RCB vs LSG: బెంగళూరు ఫ్యాన్స్‌పై గంభీర్ అసహనం.. సైలెన్స్ అంటూ సంజ్ఞలు.. వైరల్ అవుతున్న వీడియో!
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) జట్టుపై లక్నో సూపర్ జెయింట్స్ (LSG) టీమ్ అనూహ్య విజయం సాధించింది. బెంగళూరులోని ( Bangalore) చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారింది. ఇరు జట్లూ కలిసి 400 పైచిలుకు పరుగులు చేశాయి. హై స్కోరింగ్ గేమ్‌లో (LSGvsRCB) ఇరు జట్ల బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డారు. చివరి బంతికి విజయం సాధించడంతో లక్నో ఆటగాళ్లు ఘనంగా సంబరాలు చేసుకున్నారు.

లక్నో టీమ్ విజయం సాధించిన అనంతరం ఆ జట్టు మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) బాగా ఎమోషన్‌కు గురయ్యాడు. మ్యాచ్ అనంతరం మైదానంలోకి వచ్చినపుడు స్టేడియంలోని ఫ్యాన్స్ వైపు చూస్తూ నోటిపై చేతులు వేసి ``సైలెన్స్`` అని సంజ్ఞలు చేశాడు ( Gautam Gambhir SILENCES RCB fans). గంభీర్ చాలా ఎమోషనల్ పర్సన్ అనే సంగతి తెలిసిందే. తాను ఆడే రోజుల్లో కూడా గంభీర్ మైదానంలో చాలా ఎమోషన్‌లు ప్రదర్శించేవాడు. బౌలర్లతో ఘర్షణకు దిగేవాడు. తాజాగా ఫ్యాన్స్‌తో పెట్టుకున్నాడు.

IPL 2023: బెంగళూరు కెప్టెన్‌కు షాక్.. భారీ జరిమానా.. లక్నో ఆటగాడు అవేశ్ ఖాన్ చేసిన పనికి..

గంభీర్ చర్యపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. చిన్న స్వామి స్టేడియంలోని అభిమానులు లక్నో టీమ్‌పై అసహనం ప్రదర్శించలేదని, అయినా గంభీర్ హద్దు మీరి ప్రవర్తించాడని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. విజయం దక్కిన ఆనందంలో గంభీర్ కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయ్యాడని మరొకరు పేర్కొన్నారు.

Updated Date - 2023-04-11T08:39:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising