Matthew Hayden: జట్టుకు అవసరమైన సమయంలో రోహిత్ ఆడడు.. ఆతడో ఫెయిల్యూర్.. మాజీ ఆటగాడి సంచలన వ్యాఖ్యలు!
ABN, First Publish Date - 2023-05-28T08:58:52+05:30
టీమిండియా కెప్టెన్, ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జట్టును నడిపిస్తున్న రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మను ఓ పరాజితుడిగా అభివర్ణించాడు. తాజా ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఆటగాడిగా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే.
టీమిండియా కెప్టెన్, ఐపీఎల్‌లో (IPL 2023) ముంబై ఇండియన్స్ (MI) జట్టును నడిపిస్తున్న రోహిత్ శర్మ (Rohit Sharma)పై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్ (Matthew Hayden) సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మను ఓ పరాజితుడి (Failure)గా అభివర్ణించాడు. తాజా ఐపీఎల్‌లో రోహిత్ శర్మ ఆటగాడిగా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ కేవలం 332 పరుగులు మాత్రమే చేశాడు. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో (GTvsMI) కేవలం 7 పరుగులకే అవుటయ్యాడు. ఈ నేపథ్యంలో రోహత్‌పై హెడెన్ విమర్శలు గుప్పించాడు.
``కీలక మ్యాచ్‌ల్లో విఫలం కావడం రోహిత్ శర్మకు కొత్తేం కాదు. టీమిండియా కావొచ్చు, ముంబై ఇండియన్స్ కావొచ్చు.. జట్టుకు అవసరమైనపుడు అతడు ఆడడం నేనెప్పుడూ చూడలేదు. అతడొక ఫెయిల్యూర్. ఈ సీజన్‌లో ముంబై ప్లే ఆఫ్స్‌కు చేరడంలో రోహిత్ పాత్ర శూన్యం. అతడి జట్టులోని ఆటగాళ్ల ప్రదర్శన కారణంగానే అతడు కెప్టెన్‌గా రాణిస్తున్నాడు. అందులో అతడి ఘనతేం లేద``ని హెడెన్ అభిప్రాయపడ్డాడు. హెడెన్ వ్యాఖ్యలపై రోహిత్ అభిమానులు మండిపడుతున్నారు.
ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఇషాన్ కిషన్, సూర్య కుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్ బ్యాటింగ్‌లో రాణించారు. గుజరాత్ చేతిలో బెంగళూరు ఓడిపోవడంతో ప్లే ఆఫ్స్‌కు చేరిన ముంబై క్వాలిఫయర్-2లో ఓడి ఇంటి దారి పట్టింది. 234 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. సీనియర్ ఆటగాడు, కెప్టెన్ అయిన రోహిత్ కేవలం 8 పరుగులకే వెనుదిరిగాడు.
Updated Date - 2023-05-28T08:58:52+05:30 IST