India vs Australia: ప్రస్తుత టీ-20 సిరీస్‌కు వాల్యూ లేదు.. కారణం అదేనంటున్న ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు
ABN, First Publish Date - 2023-11-30T12:36:39+05:30
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ-20 సిరీస్‌కు ఆదరణ లేకపోవడానికి కారణమేంటో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ తెలిపారు. ప్రపంచకప్ ముగిసిన వెంటనే ఈ సిరీస్ నిర్వహించడం చాలా తప్పిదమని, వరుస గేమ్‌లు క్రికెట్‌లోని మజాను చంపేస్తున్నాయని హస్సీ అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య జరుగుతున్న టీ-20 సిరీస్‌కు (T20I Series) ఆదరణ లేకపోవడానికి కారణమేంటో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు మైకేల్ హస్సీ (Michael Hussey) తెలిపారు. ప్రపంచకప్ (World Cup) ముగిసిన వెంటనే ఈ సిరీస్ నిర్వహించడం చాలా తప్పిదమని, వరుస గేమ్‌లు క్రికెట్‌లోని మజాను చంపేస్తున్నాయని హస్సీ అభిప్రాయపడ్డాడు. నవంబర్ 19వ తేదీన అహ్మదాబాద్‌లో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ ఆడిన భారత్, ఆస్ట్రేలియా జట్లు నాలుగు రోజుల వ్యవధిలో 23వ తేదీన విశాఖపట్నంలో టీ-20 మ్యాచ్ ఆడాయి.
``ఈ టీ-20 సిరీస్‌కు వాల్యూ లేకుండాపోయింది. ప్రస్తుతం వివిధ దేశాల క్రికెట్ బోర్డులు ఎక్కువ సిరీస్‌లు నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అన్ని సిరీస్‌లు ఆడడం, ప్రాక్టీస్ చేయడం, వివిధ దేశాలకు ప్రయాణించడం ఆటగాళ్లకు సాధ్యం కాదు. వరుసగా అన్ని మ్యాచ్‌లు జరిగితే ఆటగాళ్లే కాదు.. అభిమానులకు కూడా ఆసక్తి తగ్గిపోతుంద``ని హస్సీ అన్నాడు. టీ-20 మ్యాచ్‌లను తగ్గించి వన్డే మ్యాచ్‌లను పెంచడంపై ఐసీసీ దృష్టి సారించాలని హస్సీ సూచించాడు.
ఆస్ట్రేలియా జట్టు త్వరలో పాకిస్తాన్‌తో టెస్ట్ సిరీస్ ఆడబోతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు చెందిన ఆరుగురు ఆటగాళ్లు గౌహతీ మ్యాచ్ తర్వాత స్వదేశానికి వెళ్లిపోయారు. పాకిస్తాన్ సిరీస్‌కు ముందు కాస్త బ్రేక్ తీసుకునేందుకు వారు ఆ నిర్ణయం తీసుకున్నారు. కాగా, ప్రస్తుతం ఆస్ట్రేలియాతో తలపడుతున్న భారత టీ-20 జట్టులో సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే ప్రపంచకప్ ఆడిన టీమిండియాలో సభ్యుడు కావడం గమనార్హం.
Updated Date - 2023-11-30T12:36:41+05:30 IST