ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mohsin Khan: మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు.. ఐసీయూలో ఉన్నాడు.. ఆయన కోసమే అంటూ లఖ్‌నవూ హీరో వ్యాఖ్యలు!

ABN, First Publish Date - 2023-05-17T12:38:05+05:30

ఐపీఎల్ మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగుతూ ఉత్కంఠను రేపుతున్నాయి. మంగళవారం సాయంత్రం ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా చివరి ఓవర్ వరకు థ్రిల్లింగ్‌గా సాగింది. చివరి ఓవర్లో బౌలర్ మొహ్సిన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి లఖ్‌నవూను గెలిపించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్ (IPL 2023) మ్యాచ్‌లు క్రికెట్ ప్రేమికులకు అసలైన మజాను అందిస్తున్నాయి. ప్రతి మ్యాచ్ చివరి ఓవర్ వరకు సాగుతూ ఉత్కంఠను రేపుతున్నాయి. మంగళవారం సాయంత్రం ముంబై ఇండియన్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్ (LSGvsMI) కూడా చివరి ఓవర్ వరకు థ్రిల్లింగ్‌గా సాగింది. చివరి ఓవర్లో బౌలర్ మొహ్సిన్ ఖాన్ (Mohsin Khan) అద్భుతంగా బౌలింగ్ చేసి లఖ్‌నవూను గెలిపించాడు. చివరి మొహిసిన్‌ సూపర్‌ యార్కర్లతో ఐదు పరుగులు మాత్రమే ఇచ్చి లఖ్‌నవూ శిబిరంలో సంతోషం నింపాడు.

మ్యాచ్ అనంతరం మొహ్సిన్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు. ``చాలా రోజులుగా అన్నీ కష్టాలే ఎదురయ్యాయి. గాయం కారణంగా ఏడాది పాటు క్రికెట్‌కు దూరమయ్యా. ఈ ఏడాది ఐపీఎల్‌తో మళ్లీ మైదానంలోకి దిగాను. మా నాన్నకు ఆరోగ్యం బాగాలేదు. పదిరోజులుగా ఐసీయూలో ఉండి సోమవారమే డిశ్చార్జ్ అయ్యారు. ఈ మ్యాచ్ చూసి ఉంటారనే నమ్మకం ఉంది. మా జట్టు విజయంలో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉంది. నాపై నమ్మకం ఉంచి చివరి ఓవర్ బౌలింగ్ చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాల``ని మొహ్సిన్ అన్నాడు.

Marcus Stoinis: జోర్డాన్‌కు చుక్కలు చూపించిన స్టోయినిస్.. ఒకే ఓవర్లో 24 పరగులు.. వీడియో వైరల్!

చివరి ఓవర్లో ముంబై విజయానికి 11 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో టిమ్ డేవిడ్ (Tim David), కామెరూన్ గ్రీన్ (Cameron Green) వంటి పవర్ హిట్టర్లు ఉండడంతో ముంబై సునాయాసంగా విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. చివరి ఓవర్ బౌలింగ్ చేసేందుకు వచ్చిన మొహ్సిన్ పదునైన యార్కర్లతో పరుగులు కట్టడి చేశాడు. చివరకు ఆ ఓవర్లో ముంబై బ్యాటర్లు 5 పరుగులు మాత్రమే చేయగలిగారు.

Updated Date - 2023-05-17T12:38:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising