IPL 2024: డబ్బు ఎప్పుడూ విలువైనదే.. కానీ, నా మొదటి ప్రాధాన్యం అంతర్జాతీయ క్రికెట్‌కే: మిచెల్ స్టార్క్
ABN, Publish Date - Dec 25 , 2023 | 04:40 PM
ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో ఐపీఎల్ స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ సంచలనం సృష్టించాడు. స్టార్క్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ ఏకంగా రూ. 24.75 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి వేలంలో పలికిన అత్యధిక ధర ఇదే.
ఇటీవల దుబాయ్ (Dubai) వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలంలో (IPL Auction) ఆస్ట్రేలియా స్పీడ్‌స్టర్ మిచెల్ స్టార్క్ (Mitchell Starc) సంచలనం సృష్టించాడు. స్టార్క్ కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) టీమ్ ఏకంగా రూ. 24.75 కోట్లు వెచ్చించింది. ఐపీఎల్ చరిత్రలో ఓ ఆటగాడికి వేలంలో పలికిన అత్యధిక ధర ఇదే. 2015 సీజన్‌లో చివరిసారిగా ఐపీఎల్ ఆడిన స్టార్క్.. గత ఏడేళ్లుగా ఈ లీగ్‌కు దూరంగా ఉన్నాడు. తాజాగా ఆ విషయంపై స్టార్క్ మాట్లాడాడు (IPL 2024).
``ఇన్నాళ్లూ ఐపీఎల్‌లో ఆడనందుకు నాకేమీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఐపీఎల్ నుంచి దూరంగా ఉండటం వల్ల టెస్టులలో నా ఆట మెరుగుపడింది. ఐపీఎల్ కంటే అంతర్జాతీయ క్రికెట్‌కు, కుటుంబానికే నా తొలి ప్రాధాన్యం. డబ్బు ఎప్పుడూ బాగుంటుంది. కానీ, దేశం తరఫున ఆడేందుకే నా తొలి ప్రాధాన్యం. వచ్చే ఏడాది టీ-20 ప్రపంచకప్‌నకు సన్నాహకంగా ఐపీఎల్ ఉపయోగపడుతుందని భావిస్తున్నా`` అంటూ స్టార్క్ పేర్కొన్నాడు.
Hardik Pandya: హార్దిక్ పాండ్యా కోసం ముంబై రూ.100 కోట్లు చెల్లించిందా? సంచలనం సృష్టిస్తున్న ట్వీట్!
మిచెల్ స్టార్క్ భార్య అలీసా హీలీ ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. తామిద్దరం ఎప్పుడూ క్రికెట్ షెడ్యూల్స్‌తో బిజీగా ఉంటామని, అంతర్జాతీయ షెడ్యూల్స్ లేనపుడు కుటుంబంతో గడపడానికే ఎక్కువ సమయం కేటాయిస్తానని, ఆ తర్వాతే డబ్బు గురించి ఆలోచిస్తానని స్టార్క్ చెప్పాడు.
Updated Date - Dec 25 , 2023 | 05:10 PM