Dhoni Warning: ఇలాగైతే కొత్త కెప్టెన్‌తో ఆడాల్సి ఉంటుంది.. బౌలర్లకు ధోనీ స్ట్రాంగ్ వార్నింగ్..!
ABN, First Publish Date - 2023-04-04T09:55:27+05:30
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీకి ``మిస్టర్ కూల్`` అని పేరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమనం కోల్పోకుండా శాంతంగా ఆలోచిస్తాడని, ప్రశాంతత కోల్పోడని అంటారు.
చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీకి (MS Dhoni) ``మిస్టర్ కూల్`` అని పేరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంయమయనం కోల్పోకుండా శాంతంగా ఆలోచిస్తాడని, ప్రశాంతత కోల్పోడని అంటారు. అలాంటి ధోనీకి కూడా చెన్నై బౌలర్లు అసహనం కలిగించారు. సోమవారం లక్నోతో (LSG) జరిగిన మ్యాచ్‌లో వైడ్, నో బాల్స్‌తో విసిగించారు. బ్యాట్స్‌మెన్ భారీగా పరుగులు చేయడంతో సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చారు. దీంతో మ్యాచ్ అనంతరం తమ బౌలర్లపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు (Dhoni angry on CSK bowlers).
``బౌలింగ్ విభాగంలో మేం చాలా మెరుగవ్వాలి. ప్రత్యర్థి జట్టు బౌలర్లు ఏం చేశారో పరిశీలించాలి. ఈ మ్యాచ్‌లో మేం చాలా ఎక్స్‌ట్రా బంతులు వేశాం. అదనపు బాల్స్ వేయడం మంచిది కాదు. ఇకపై సరి చేసుకోవాలి. లేకపోతే కొత్త కెప్టెన్ నాయకత్వంలో ఆడాల్సి ఉంటుంద``ని ధోనీ హెచ్చరించాడు. బౌలర్లకు ధోనీ వార్నింగ్ ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోమవారం లక్నోతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బౌలర్లు ఏకంగా 13 వైడ్లు, 3 నో బాల్స్ వేశారు.
Dhoni Six: 2011 ప్రపంచకప్ అందించిన ధోనీ సిక్స్‌ను మరచిపోగలమా? ఆ సిక్స్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఏం చేస్తున్నారంటే..
నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత సొంత మైదానంలో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 12 పరుగుల తేడాతో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌పై సీఎస్‌కే గెలిచింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 7 వికెట్లకు 217 పరుగులు చేసింది. ఛేజింగ్‌లో లక్నో 205 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Updated Date - 2023-04-04T10:16:16+05:30 IST