MIvsRR: 1000వ మ్యాచ్‌లో ముంబై రికార్డు విజయం.. ప్రేక్షకులకు అసలు సిసలు మజా అందించిన మ్యాచ్!
ABN, First Publish Date - 2023-05-01T09:12:44+05:30
ఐపీఎల్ సీజన్ ఆసక్తికర దశకు చేరుకుంది. అన్ని టీమ్‌లు అంచనా మేరకు రాణిస్తూ లీగ్‌పై ఆసక్తి పెంచుతున్నాయి. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.
ఐపీఎల్ (IPL 2023) సీజన్ ఆసక్తికర దశకు చేరుకుంది. అన్ని టీమ్‌లు అంచనా మేరకు రాణిస్తూ లీగ్‌పై ఆసక్తి పెంచుతున్నాయి. ఆదివారం ముంబైలోని (Mumbai) వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది (MIvsRR). ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలో 1000వ మ్యాచ్ కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ముంబై (MI) రికార్డు విజయం సాధించింది. ఏకంగా 212 పరుగులను ఛేజ్ చేసింది. వాంఖడే స్టేడియంలో ఇదే రికార్డు ఛేజింగ్ కావడం విశేషం.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ (RR) ఇన్నింగ్స్‌ను ఓపెనర్ జైస్వాల్ (Yashasvi Jaiswal) ఒక్కడే ముందుకు నడిపించాడు. ఎందుకంటే జైస్వాల్ మినహా మిగత బ్యాట్స్‌మెన్ ఎవరూ కనీసం 20 పరుగులు కూడా చేయలేకపోయారు. జైస్వాల్ మాత్రం వీరోచితంగా పోరాడి 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. మరో ఎండ్ నుంచి సహకారం లేకపోయినా జైస్వాల్ మాత్రం 200 స్ట్రైక్ రేట్‌తో స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 212 పరుగులు చేసింది.
Super Six: యశస్వి జైస్వాల్ సూపర్ సిక్స్.. ఆర్చర్ వేసిన బాల్ ఎంత పైకి వెళ్లిందంటే..
భారీ లక్ష్య ఛేదనను ముంబై తడబడుతూనే ఆరంభించింది. రోహిత్ (Rohit Sharma) మూడు పరుగులకే ఔట్ కాగా.. ఇషాన్ (28) వేగంగా ఆడలేకపోయాడు. అయితే కామెరూన్ గ్రీన్ (26 బంతుల్లో 44) ఆకట్టుకున్నాడు. అయినా 12వ ఓవర్ వరకు రాజస్థాన్‌దే పైచేయిగా నిలిచింది. అయితే సూర్య కుమార్ యాదవ్ (Suryakumar Yadav ) పదో ఓవర్‌లో 4,4,4.. 13వ ఓవర్‌లో 6,4,4,4తో విరుచుకుపడి విజయంపై ఆశలు రేకెత్తించాడు. 24 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేశాడు. ఆ తర్వాత టిమ్ డేవిడ్ (Tim David) బాధ్యత తీసుకున్నాడు. 19వ ఓవర్‌లో టిమ్ డేవిడ్ 6,4తో 15 రన్స్ చేయడంతో.. ఆఖరి ఓవర్‌లో ముంబై గెలుపునకు 17 పరుగులు అవసరమయ్యాయి. హోల్డర్ వేసిన ఈ ఓవర్‌లో డేవిడ్ చెలరేగి హ్యాట్రిక్ సిక్సర్లతో హోరెత్తించి ముంబైని విజయ తీరాలకు చేర్చాడు.
Updated Date - 2023-05-01T09:12:44+05:30 IST