Rashid Khan: రషీద్ ఖాన్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాల్సింది.. ఆల్‌రౌండర్‌పై నెటిజన్ల ప్రశంసలు!
ABN, First Publish Date - 2023-05-13T10:53:41+05:30
శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఇద్దరు ప్రతిభావంతుల ఆటను మరోసారి ప్రేక్షకులకు అందించింది. ముంబై ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (49 బంతుల్లో103 నాటౌట్) బ్యాట్‌తో చెలరేగాడు
శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ (GTvsMI) ఇద్దరు ప్రతిభావంతుల ఆటను మరోసారి ప్రేక్షకులకు అందించింది. ముంబై ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) (49 బంతుల్లో103 నాటౌట్) బ్యాట్‌తో చెలరేగాడు. గుజరాత్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్ (Rashid Khan) అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ సత్తా చాటాడు. ముందుగా బౌలింగ్ వేసి 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఛేజింగ్‌లో (32 బంతుల్లో 79 నాటౌట్) ముంబైకి చెమటలు పట్టించాడు.
ఆరంభం నుంచి క్రమంగా వికెట్లు కోల్పోతూ ఓటమి దిశగా సాగుతున్న గుజరాత్ టైటాన్స్ స్కోరు బోర్డుకు రషీద్ ఖాన్ ఒక్కసారిగా ఊపు తీసుకొచ్చాడు. చివర్లో అనూహ్య ఆటతీరుతో చెలరేగాడు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 3 ఫోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు (Rashid Khan All-round Show). తను కాస్త ముందే వచ్చి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో. అయితే అప్పటికే జట్టు కోలుకోలేని స్థితిలో ఉండడంతో ఎలాంటి ఆశలు లేకపోయాయి. అయితే ఓటమి అంతరం మాత్రం గణనీయంగా తగ్గింది.
Suryakumar Yadav: ఆ షాట్ ఎలా సాధ్యం? సూర్య బ్యాటింగ్ చూసి సచిన్ షాక్.. వైరల్ అవుతున్న వీడియో!
సెంచరీతో చెలరేగిన సూర్య కుమార్ యాదవ్‌కు ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్`` (Player Of the Match) అవార్డు దక్కింది. రషీద్ అద్భుత ఆటతీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్‌కే ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్`` అవార్డు రావాల్సిందని అభిప్రాయపడుతున్నారు. గుజరాత్ టీమ్‌లో రషీద్‌ను మించిన విలువైన ఆటగాడు లేడని ప్రశంసిస్తున్నారు.
Updated Date - 2023-05-13T10:53:41+05:30 IST