ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KKRvsSRH: నితీష్ రాణా విధ్వంసం మామూలుగా లేదు.. ఒకే ఓవర్లో 28 పరుగులు.. హైదరాబాద్‌ను వణికించాడుగా..

ABN, First Publish Date - 2023-04-15T08:36:41+05:30

మొన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ బ్యాటర్ రింకూ సింగ్ విధ్వంసం మర్చిపోకముందే తాజాగా అదే టీమ్ కెప్టెన్ నితీష్ రాణా కూడా మెరుపులు మెరిపించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

మొన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బ్యాటర్ రింకూ సింగ్ (Rinku Singh) విధ్వంసం మర్చిపోకముందే తాజాగా అదే టీమ్ కెప్టెన్ నితీష్ రాణా (Nitish Rana) కూడా మెరుపులు మెరిపించాడు. ఒకే ఓవర్లో 28 పరుగులు సాధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) టీమ్‌లో వణుకు పుట్టించాడు. హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ (Umran Malik) వేసిన 6వ ఓవర్లో రాణా ఎదురు దాడికి దిగాడు. వరుసగా 4,6,4,4,4,6 కొట్టి హార్డ్ హిట్టింగ్ అంటే ఏంటో చూపించాడు. మొత్తం 41 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 75 పరుగులు చేశాడు.

నితీష్‌కు తోడుగా గత మ్యాచ్ విన్నర్ రింకూ సింగ్ (31 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58 నాటౌట్) కూడా మరోసారి బ్యాట్ ఝుళిపించడంతో కోల్‌కతా మళ్లీ అద్భుత విజయం సాధిస్తుందేమో అనిపించింది. అయితే నితీష్ ఔట్ కావడంతో హైదరాబాద్ విజయం దాదాపు ఖరారైపోయింది. టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతాపై హైదరాబాద్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. ఇంగ్లండ్ సంచలనం హ్యారీ బ్రూక్ (Harry Brook) సెంచరీ సాధించడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 228 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Viral Video: గుజరాత్ టీమ్ విన్నింగ్ మూమెంట్స్.. స్టేడియంలో అభిమానులు ఎలా పండగ చేసుకున్నారో చూడండి..

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు ఆరంభంలోనే ఎదురు దెబ్బలు తగిలాయి. 4 ఓవర్లకు 22/3తో కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత వచ్చిన నితీష్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఉమ్రాన్ మాలిక్ దాదాపు 150 కిలో మీటర్ల వేగంతో విసిరిన బంతులను అంతే వేగంగా బౌండరీలకు తరలించాడు. మాలిక్ వేసిన ఆరో ఓవర్లో ఏకంగా 28 పరుగులు సాధించాడు. అయితే నటరాజన్ బౌలింగ్‌లో నితీష్ వెనుదిరగడంతో కోల్‌కతా విజయంపై ఆశలు సన్నగిల్లాయి.

Updated Date - 2023-04-15T08:36:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising