ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India goals: భారత్‌ గోల్స్‌ వర్షం

ABN, First Publish Date - 2023-08-04T03:31:44+05:30

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీని భారత హాకీ జట్టు ఘన విజయంతో ఆరంభించింది. పెనా ల్టీ కార్నర్లను గురి తప్పకుండా కొట్టిన టీమిండియా గురువారం జరిగిన మ్యాచ్‌లో 7-2తో చైనాను చిత్తుచేసింది.

7-2తో చైనాపై ఘన విజయం

ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీ

చెన్నై: ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీని భారత హాకీ జట్టు ఘన విజయంతో ఆరంభించింది. పెనా ల్టీ కార్నర్లను గురి తప్పకుండా కొట్టిన టీమిండియా గురువారం జరిగిన మ్యాచ్‌లో 7-2తో చైనాను చిత్తుచేసింది. హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (5వ, 8వ నిమిషం), వరుణ్‌ కుమార్‌ (19వ, 30వ) చెరో రెండు గోల్స్‌ చేయగా.. సుఖ్‌జీత్‌ సింగ్‌ (15వ), ఆకాష్‌దీప్‌ సింగ్‌ (16వ), మన్‌దీ్‌ప సింగ్‌ (40వ) పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలిచారు. చైనా తరఫున వెన్‌హు (18వ), కవో జిషంగ్‌ (25వ) చెరో గోల్‌ సాధించారు. మ్యాచ్‌ ఆరంభం నుంచే భారత జట్టు టాప్‌ గేర్‌ వేసింది. ఐదో నిమిషంలోనే హర్మన్‌ప్రీత్‌ గోల్‌ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. మరో మూడు నిమిషాలకు మరోసారి బంతిని ప్రత్యర్థి గోల్‌లోకి పంపాడు. ఆపై సుఖ్‌జీత్‌ చేసిన గోల్‌తో తొలి క్వార్టర్‌లోనే టీమిండియా మూడు గోల్స్‌ లీడ్‌ సాధించింది. రెండో క్వార్టర్‌లో వరుణ్‌ రెండు, ఆకాష్‌దీప్‌ సింగ్‌ ఓ గోల్‌ చేయగా, చైనా రెండు గోల్స్‌ చేసి సవాల్‌ విసిరింది. ఇక, మూడో క్వార్టర్‌లో మన్‌దీ్‌ప గోల్‌తో భారత్‌ 7-2తో నిలిచింది. అయితే, నాలుగో క్వార్టర్‌లో ఇరుజట్లూ గోల్‌ చేయడంలో విఫలమయ్యాయి. మ్యాచ్‌లో నమోదైన తొమ్మిది గోల్స్‌ కూడా పెనాల్టీ కార్నర్ల ద్వారానే కావడం విశేషం.

పాక్‌కు ఝలక్‌: మాజీ చాంపియన్‌ పాకిస్థాన్‌కు తొలి మ్యాచ్‌లోనే షాక్‌ తగిలింది. అష్హరి ఫిర్హాన్‌ (28వ, 29వ) నిమిషం తేడాతో రెండు ఫీల్డ్‌ గోల్స్‌తో అదరగొట్టడంతో మలేసియా 3-1తో పాక్‌ను చిత్తు చేసింది. కాగా, డిఫెండింగ్‌ చాంప్‌ కొరియా శుభారంభం చేసింది. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కొరియా 2-1తో జపాన్‌ను ఓడించింది.

Updated Date - 2023-08-04T03:31:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising