ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jadeja Wife Rivaba: ఏం కావాలి ఇంతకు మించి.. జడేజా భార్య ఎమోషనల్ వీడియో వైరల్..!

ABN, First Publish Date - 2023-05-30T14:15:11+05:30

దాదాపు రెండు నెలలు ఎంతో ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్-16 అంతే ఆసక్తికరంగా ముగిసింది. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలపడ్డాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దాదాపు రెండు నెలలు ఎంతో ఆసక్తికరంగా సాగిన ఐపీఎల్-16 (IPL 2023) అంతే ఆసక్తికరంగా ముగిసింది. సోమవారం సాయంత్రం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో (IPL 2023 Final Match) చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ (CSKvsGT) తలపడ్డాయి. ఆఖరి ఓవర్ వరకు విజయం ఇరు జట్లతోనూ దోబూచులాడింది. చివరి రెండు బంతులకు సిక్స్, ఫోర్ కొట్టి తన చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌ను గెలిపించాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja). దీంతో చెన్నై టీమ్ సంబరాల్లో మునిగిపోయింది.

ఈ మ్యాచ్ చూసేందుకు రవీంద్ర జడేజా భార్య, జామ్ నగర్ నార్త్ ఎమ్మెల్యే అయిన రవీబా జడేజా (Rivaba Jadeja) స్టేడియంకు వచ్చారు. చివరి బంతికి ఫోర్ కొట్టి జడేజా సీఎస్కేను గెలిపించగానే ఆమె సంతోషం పట్టలేకపోయారు. ఆనందబాష్పాలతో చప్పట్లు కొడుతూ భర్త జడేజాను, సీఎస్కే ఆటగాళ్లను అభినందించారు. మైదానంలో తన సంతోషాన్ని జడేజా తన భార్యతో పంచుకున్నాడు. ఇద్దరూ కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) గా మారింది.

MS Dhoni: మెరుపు వేగం అంటే ఇదేనేమో.. ప్రమాదకర గిల్‌ను ధోనీ ఎలా స్టంపౌట్ చేశాడో చూడండి..

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) కూడా ఈ మ్యాచ్‌ విజయం తర్వాత ఎమోషనల్ అయ్యాడు. జడేజాను ఎత్తుకుని మరీ అభినందించాడు. వర్షం కారణంగా ఆదివారం జరగాల్సిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను రిజర్వ్ డేకు మార్చిన విషయం తెలిసిందే. అయితే, సోమవారం కూడా వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ జరుగుతుందా లేక గుజరాత్ టైటాన్స్ ను విజేతగా ప్రకటిస్తారా అని ఉత్కంఠ నెలకొంది. అయితే వరణుడు శాంతించడంతో మ్యాచ్ జరిగి చెన్నై ఐదోసారి కప్ అందుకుంది.

Updated Date - 2023-05-30T14:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising