Virat Kohli: అయ్యో.. విరాట్ కోహ్లీ పోరాటం వృథా.. ఐపీఎల్ నుంచి ఆర్సీబీ అవుట్.. కన్నీళ్లు పెట్టుకున్న కోహ్లీ!
ABN, First Publish Date - 2023-05-22T09:02:55+05:30
ఐపీఎల్ 2023లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కథ ముగిసింది. ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన బెంగళూరు ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన విరాట్ కోహ్లీ, డుప్లెసి తమ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయారు.
ఐపీఎల్ 2023లో (IPL 2023) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కథ ముగిసింది. ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిన బెంగళూరు (RCBvsGT) ఐపీఎల్ నుంచి నిష్క్రమించింది. ఈ సీజన్‌లో అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన విరాట్ కోహ్లీ (Virat Kohli), డుప్లెసి (Faf du Plessis) తమ జట్టును ప్లే ఆఫ్స్‌కు చేర్చలేకపోయారు. ఈసారైనా టైటిల్ గెలిచి తొలిసారి కప్ అందుకోవాలనుకున్న బెంగళూరు కల నెరవేరలేదు. దీంతో ఆర్సీబీ టీమ్‌తో పాటు అభిమానులు కూడా నిరాశలో కూరుకుపోయారు.
198 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో బెంగళూరు బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. కేవలం నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టి భారీగా పరుగులు సమర్పించుకున్నారు. తప్పకుండా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన చేసి ఓటమికి కారణమయ్యారు. ఓటమి అనంతరం విరాట్ కోహ్లీ భావోద్వేగానికి గురయ్యాడు (Virat Kohli Emotional). ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ అద్భుత సెంచరీ (Kohli Century) సాధించాడు. కోహ్లీకి ఇది వరుసగా రెండో సెంచరీ. అయినా ఆర్సీబీ తన సెంటిమెంట్‌ను పునరావృతం చేస్తూ ప్లే ఆఫ్స్‌కు చేరకుండా ఇంటి దారి పట్టింది.
Naveen Ul Haq: కోహ్లీతో పెట్టుకుంటే అలాగే ఉంటుంది.. నవీన్-ఉల్‌ను టీజ్ చేసిన కోహ్లీ ఫ్యాన్స్.. రియాక్షన్ ఏంటంటే..
మ్యాచ్ ఆఖర్లో డగౌట్‌లో కూర్చుని వీక్షించిన కోహ్లీ ఆర్సీబీ ఓటమి పాలవగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మౌనంగా ఉండిపోయాడు. అందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే ఈ క్లిష్ట దశలో కోహ్లీకి అభిమానులు అండగా నిలుస్తున్నారు. ``జట్టు ఓటమి పాలైనా.. నువ్వు ఎప్పటికీ మా కింగ్‌వే`` అని కామెంట్లు చేస్తున్నారు.
Updated Date - 2023-05-22T09:02:55+05:30 IST