Rinku Singh Bat: రింకూ బ్యాట్ వెనుక ఆసక్తికర కథ.. ఆ బ్యాట్ ఎవరిదో తెలిస్తే..
ABN, First Publish Date - 2023-04-10T13:36:33+05:30
ఓటమి తథ్యం అనుకున్న దశ నుంచి అనూహ్య విజయం అందించాడు. చివరి ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా.. ఏకంగా ఐదు సిక్స్‌లు కొట్టాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు.
ఓటమి తథ్యం అనుకున్న దశ నుంచి అనూహ్య విజయం అందించాడు. చివరి ఓవర్లో 29 పరుగులు అవసరం కాగా.. ఏకంగా ఐదు సిక్స్‌లు కొట్టాడు. ఒక్క ఇన్నింగ్స్‌తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. గుజరాత్ టైటాన్స్ (GT)తో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ (KKR) ఆటగాడు రింకూ సింగ్ (Rinku Singh) ఆడిన విధానం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. రింకూ సంచలన ఇన్నింగ్స్ ఆడిన బ్యాట్ (Rinku Singh Bat) మాత్రం అతడిది కాదట. కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణాదట (Nitish Rana). ఆ బ్యాట్ వెనకున్న ఆసక్తికర విషయం తాజాగా బయటకు వచ్చింది.
ఆ బ్యాట్ గురించి కేకేఆర్ కెప్టెన్ నితీష్ రాణా ఓ ఆసక్తికర విషయం చెప్పాడు. ``ఆ బ్యాట్ నాకు చాలా సెంటిమెంట్. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో ఆ బ్యాట్‌తోనే పరుగులు చేశాను. ఈ ఐపీఎల్‌లో కూడా దానితోనే ఆడుతున్నాను. ఆ బ్యాట్‌తో ఆడతానని రింకూ నన్ను అడిగాడు. ఆ బ్యాట్ అతడికి నేను ఇవ్వాలనుకోలేదు. కానీ, డ్రెస్సింగ్ రూమ్‌లో ఎవరో ఆ బ్యాట్‌ను రింకూకు ఇచ్చేశారు. ఆ బ్యాట్‌తో రింకూ చెలరేగిపోయాడ``ని నితీష్ తెలిపాడు.
Shikhar Dhawan: అక్కడివరకు వెళ్తాననుకోలేదు.. సూపర్ ఇన్నింగ్స్‌పై ధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఇక, ఆ బ్యాట్ రింకూకే ఇచ్చేస్తానని, ఆ లక్కీ బ్యాట్‌ను వెనక్కి తీసుకోనని రాణా పేర్కొన్నాడు. కాగా, సంచలన ఇన్నింగ్స్ ఆడి విజయం అందించిన రింకూపై రాణా ప్రశంసలు కురిపించాడు. ఈ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుందని పేర్కొన్నాడు.
Updated Date - 2023-04-10T13:36:33+05:30 IST