Rinku Singh: లఖ్‌నవూ అదృష్టం బాగుంది.. ఒక్క పరుగుతో గట్టెక్కింది.. రింకూ బ్యాటింగ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..
ABN, First Publish Date - 2023-05-21T09:12:54+05:30
కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ బ్యాటింగ్‌కు వస్తుంటే ప్రత్యర్థి ఆటగాళ్ల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గెలిచే స్థితిలో ఉన్న మ్యాచ్‌ను ఎక్కడ లాగేసుకుంటాడోనని.. ఈ సీజన్‌లో రింకూ సింగ్ కచ్చితంగా ఓ సంచలనం.
కోల్‌కతా బ్యాటర్ రింకూ సింగ్ (Rinku Singh) బ్యాటింగ్‌కు వస్తుంటే ప్రత్యర్థి ఆటగాళ్ల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి. గెలిచే స్థితిలో ఉన్న మ్యాచ్‌ను ఎక్కడ లాగేసుకుంటాడోనని.. ఈ సీజన్‌లో (IPL 2023) రింకూ సింగ్ కచ్చితంగా ఓ సంచలనం. గుజరాత్‌తో (GT) మ్యాచ్‌లో చివరి ఓవర్లో 5 సిక్స్‌లు కొట్టిన రింకూ తనది గాలివాటం బ్యాటింగ్ కాదని ఆ తర్వాత కూడా నిరూపించాడు. తాజాగా లఖ్‌నవూ (LSG) మ్యాచ్‌లోనూ చెలరేగాడు. ఓడిపోయే స్థితిలో ఉన్న జట్టును ట్రాక్‌పైకి తీసుకొచ్చాడు. ఒంటరి పోరాటం చేశాడు. అయితే లఖ్‌నవూ అదృష్టం బాగుండి ఒక్క పరుగు తేడాతో గట్టెక్కింది.
శనివారం జరిగిన మ్యాచ్‌లో (LSGvsKKR) ముందుగా బ్యాటింగ్ చేసిన లఖ్‌నవూ 20 ఓవర్లలో 8 వికెట్లకు 176 పరుగులు చేసింది. ఛేదనను కోల్‌కతా మెరుగ్గానే ఆరంభించింది. తొలి వికెట్‌కు 61 పరుగులు జోడించింది. జేసన్ రాయ్ (45), వెంకటేష్ అయ్యర్ (24) మెరుపు ఆరంభాన్ని అందించారు. అయితే వారు ఔటైన తర్వాత సీన్ రివర్స్ అయింది. కోల్‌కతా వరుస ఓవర్లలో వికెట్లు కోల్పోయింది. రింకూ సింగ్ (33 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 నాటౌట్) మాత్రం లఖ్‌నవూ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. అతడు ఓ వైపు పోరాడుతున్నా మరో ఎండ్‌లో గుర్బాజ్ (10), రస్సెల్ (7) శార్దూల్ (3), నరైన్ (1) నిరాశపరిచారు.
MS Dhoni: ఒక్కడిపై అంత అభిమానమా? ఢిల్లీలో ధోనీపై అభిమాన సంద్రం.. బ్యాటింగ్‌కు దిగుతున్నప్పుడు దద్దరిల్లిన స్టేడియం!
చివరి రెండు ఓవర్లలో 41 పరుగులు కావాల్సిన దశలో కూడా రింకూ పట్టు వదల్లేదు. ఆ రెండు ఓవర్లలో రింకూ బాదుడుకు లఖ్‌నవూ గుండె గుభేల్‌మంది. 12 బంతుల్లో 41 పరుగులు కావాల్సిన వేళ 19వ ఓవర్‌లో 4,4,4,2,6తో 20 రన్స్ వచ్చాయి. ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు కావాల్సి వచ్చాయి. చివరి ఓవర్లో చివరి రెండు బంతులకు 12 పరుగులు కావాల్సి వచ్చింది. అయితే రింకూ 6,4 కొట్టడంతో కేవలం పరుగు తేడాతో కేకేఆర్ ఓడాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం రింకూ ప్రదర్శనను లఖ్‌నవూ ఆటగాళ్లందరూ మెచ్చుకున్నారు.
Updated Date - 2023-05-21T09:12:54+05:30 IST