ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

RCBvsMI: క్యాచ్‌లు మిస్.. అనుష్క శర్మ హ్యాపీ.. రోహిత్ శర్మకు బీపీ.. వైరల్ అవుతున్న వీడియో!

ABN, First Publish Date - 2023-05-10T13:22:11+05:30

ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలి కాలంలో మైదానంలో భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో ఆటగాళ్లు తప్పు చేసినపుడు రోహిత్ కాస్త అసహనానికి గురవుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎప్పుడూ ప్రశాంతంగా కనిపించే ముంబై (MI) కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇటీవలి కాలంలో మైదానంలో భావోద్వేగాలను ప్రదర్శిస్తున్నాడు. ముఖ్యంగా ఫీల్డింగ్‌లో ఆటగాళ్లు తప్పు చేసినపుడు రోహిత్ కాస్త అసహనానికి గురవుతున్నాడు. మంగళవారం బెంగళూరతు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (RCBvsMI) రోహిత్ శర్మ (Rohit Sharma Angry) రెండు సార్లు ఆగ్రహం ప్రదర్శించాడు. ప్రమాదకర డుప్లెసిస్‌ను ఔట్ చేసే అవకాశం ముంబై టీమ్‌కు ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే లభించింది. అయితే ఫీల్డింగ్ తప్పిదాల వల్ల డుప్లెసి (Faf Du Plessis) బతికిపోయాడు.

ఇన్నింగ్స్ తొలి ఓవర్ నాలుగో బంతిని డుప్లెసి మిడ్ వికెట్ దిశగా ఆడాడు. అయితే ఆ షాట్ కనెక్ట్ కాకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న నేహల్ వధేరా (Nehal Wadhera) చేతుల్లోకి వచ్చిన సులభమైన క్యాచ్‌ను వదిలేశాడు. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. అప్పటికి డుప్లెసి పరుగులేమీ చేయలేదు. వధేరా క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన డుప్లెసి 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసి బెంగళూరు భారీ స్కోరుకు బాటలు వేశాడు.

Virat vs Gambhir: విరాట్‌ను వదలరా? కోహ్లీ అవుట్.. సెలబ్రేట్ చేసుకున్న నవీనుల్, గంభీర్..!

ఇన్నింగ్స్ చివర్లో దినేష్ కార్తీక్ (Dinesh Karthik) క్యాచ్‌ను కామెరూన్ గ్రీన్ వదిలేశాడు. బౌండరీ లైన్ వద్ద చేతుల్లోకి వచ్చిన బంతిని గ్రీన్ వదిలేయడంతో రోహిత్ అసహనానికి గురయ్యాడు. కాగా, గ్రీన్ క్యాచ్ వదిలేయడంతో గ్యాలరీలో కూర్చున్న అనుష్క శర్మ (Anushka Sharma) సెలబ్రేట్ చేసుకుంది. దినేష్ కొట్టిన బంతి గాల్లో ఉన్నప్పుడు ఆందోళన చెందిన అనుష్క.. క్యాచ్ మిస్ కాగానే లేచి నిల్చుని పండగ చేసుకుంది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-05-10T13:22:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising