ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MIvsKKR: జహీర్ ఖాన్ ఇంటర్వ్యూ ఇస్తుండగా రోహిత్, ఇషాన్ కిషన్ ఏం చేశారో చూడండి.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!

ABN, First Publish Date - 2023-04-17T08:49:24+05:30

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్‌లో (IPL 2023) ముంబై ఇండియన్స్ (MI) టీమ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (MIvsKKR) జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 186 పరుగుల భారీ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగిన ముంబై సునాయాసంగా గెలుపు తీరాలకు చేరుకుంది. ఈ విజయాన్ని ముంబై టీమ్ ఘనంగా సెలబ్రేట్ చేసుకుంది. ఫ్రాంఛైజీ ఓనర్ నీతా అంబానీ (Nita Ambani) కూడా మైదానంలోకి దిగి సంబరాల్లో పాలుపంచుకున్నారు.

ఆ సమయంలో టీమిండియా మాజీ ఆటగాడు జహీర్ ఖాన్ (Zaheer Khan) జియో సినిమాతో మ్యాచ్ గురించి ఇంటర్వ్యూ ఇస్తున్నాడు. ఆ పక్క నుంచే ముంబై ఆటగాళ్లు గెలుపు సంబరాలు చేసుకుంటూ వెళ్తున్నారు. జహీర్‌ను చూసిన రోహిత్ శర్మ (Rohit Sharma), ఇషాన్ కిషన్ అతడి దగ్గరకు వెళ్లి ఇంటర్వ్యూ మధ్య నుంచి బలవంతంగా లాక్కెళ్లిపోయారు. జహీర్ గతంలో ముంబై ఇండియన్స్ తరఫున ఆడాడు. ఆ తర్వాత ముంబై కోచింగ్ టీమ్‌లో కూడా పని చేశాడు. ఈ నేపథ్యంలో జహీర్‌కు రోహిత్‌తో మంచి అనుబంధం ఉంది. దాంతోనే జహీర్‌తో రోహిత్ సరదాగా ప్రవర్తించాడు.

GTvsRR: సాహా క్యాచ్ కోసం ఎంత మంది పరిగెత్తారో.. చివరకు ఆ క్యాచ్ ఎలా పట్టారో చూడండి..!

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer)సెంచరీతో (104) నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు ఓపెనర్లు రోహిత్, ఇషాన్ కిషన్ మెరుపు ఆరంభాన్ని అందించారు. ఇషాన్‌ కిషన్‌ (25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 58)కి తోడు సూర్యకుమార్‌ యాదవ్‌ (25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43) చెలరేగడంతో ముంబై 17.4 ఓవర్లలోనే లక్ష్యం చేరుకుంది.

Updated Date - 2023-04-17T08:49:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising