ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajastan Vs Bangalore: ఐపీఎల్‌లో బెంగళూరు సంచలన విజయం.. రాజస్థాన్ బ్యాటర్లు దారుణంగా విఫలం..

ABN, First Publish Date - 2023-05-14T18:42:27+05:30

ఐపీఎల్ 2023లో (IPL2023) ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) చెలరేగింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జైపూర్: ఐపీఎల్ 2023లో (IPL2023) ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్స్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore) చెలరేగింది. రాజస్థాన్ రాయల్స్‌పై (Rajasthan Royals) సంచలన విజయాన్ని నమోదు చేసింది. 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్‌ను స్వల్ప స్కోరుకే ఆర్సీబీ బౌలర్లు ఆలౌట్ చేశారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభంలోనే పార్నెల్ చెలరేగి 3 వికెట్లను పడగొట్టాడు. ఆ తర్వాత బ్రేస్‌వెల్, కర్ణ్ శర్మ చెరో 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్, గ్లేన్ మ్యాక్స్‌వెల్ చెరో వికెట్ తీయడంతో కేవలం 59 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ ఆలౌట్ అయ్యింది. దీంతో ఏకంగా 112 పరుగుల తేడాతో ఆర్సీబీ ఘనవిజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి దూసుకెళ్లింది. రాజస్థాన్ రాయల్స్ 6వ స్థానానికి పడిపోయింది.

రాజస్థాన్ బ్యాట్స్‌మెన్లలో హిట్మేయర్ (35) మినహా మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్లు యశశ్వి జైస్వాల్, జాస్ బట్లర్ ఇద్దరూ డకౌట్ అయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ (4), జో రూట్ (10), దేవధూత్ పడిక్కల్ (4), షిమ్రోన్ హిట్మేయర్ (35), ధ్రువ్ జురెల్ (1), రవిచంద్రన్ అశ్విన్ (0), ఆడమ్ జంపా (2), సందీప్ శర్మ (0), కేఎం అసిఫ్ (0) చొప్పున పరుగులు చేశారు.

Updated Date - 2023-05-14T19:04:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising