Ruturaj Gaikwad: ఆ నో-బాల్ ఎంత పని చేసింది.. గుజరాత్ ఓటమికి అది కూడా ఓ కారణమే..
ABN, First Publish Date - 2023-05-24T11:40:33+05:30
టీ-20 క్రికెట్‌లో చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌లను మలుపుతిప్పుతాయి. ఒక్క బాల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. తాజాగా మంగళవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య చెన్నైలో మ్యాచ్ జరిగింది.
టీ-20 క్రికెట్‌లో చిన్న చిన్న విషయాలే మ్యాచ్‌లను మలుపుతిప్పుతాయి. ఒక్క బాల్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది. తాజాగా మంగళవారం సాయంత్రం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (GTvsCSK) జట్ల మధ్య చెన్నైలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad ) 60 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలక పాత్ర పోషించాడు. నిజానికి రుతురాజ్‌ను గుజరాత్ టీమ్ ఆరంభంలోనే అవుట్ చేసింది. అయితే అది నో-బాల్ (No-Ball) కావడంతో రుతురాజ్ బతికిపోయాడు. ఏకంగా 60 పరుగులు చేసి ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు.
గుజరాత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై గుజరాత్ బౌలర్లు మంచి బంతులేశారు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే రుతురాజ్‌ను గుజరాత్ బౌలర్ దర్శన్ (Darshan Nalkande) అవుట్ చేశాడు. అయితే అది నో-బాల్‌గా తేలడంతో రుతురాజ్ బతికిపోయాడు. ఫ్రీ-హిట్‌గా వచ్చిన తర్వాత బంతిని సిక్స్ కొట్టాడు. ఆరంభంలోనే లైఫ్ రావడంతో ఆ తర్వాత చెలరేగించిన రుతురాజ్ 44 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 60 పరుగులు చేశాడు. ఫలితంగా చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 172 పరుగులు చేసింది.
MS Dhoni: ధోనీ అవుటయ్యాక చెపాక్ స్టేడియం సైలెంట్.. హార్దిక్ పాండ్యా కూడా సెలబ్రేషన్స్ చేసుకోకుండా..
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ను చెన్నై బౌలర్లు కట్టడి చేశారు. బంతి చక్కగా టర్న్ కావడంతో గుజరాత్‌కు 173 పరుగుల ఛేదన అత్యంత కష్టంగా మారింది. గిల్ (Shubman Gill) (38 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 42), రషీద్ ఖాన్ (Rashid Khan) (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 30) మాత్రమే చెప్పుకోదగిన విధంగా పరుగులు చేశారు. చివరకు గుజరాత్ 20 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది.
Updated Date - 2023-05-24T11:40:33+05:30 IST