ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PBKSvsLSG: ధవన్ స్థానంలో నాయకుడిగా శామ్ కర్రన్.. డీఆర్‌ఎస్‌ను ఎలా వాడుకున్నాడో చూడండి..

ABN, First Publish Date - 2023-04-16T10:20:47+05:30

ఎంత అనుభవం, నైపుణ్యం ఉన్నా బంతి బ్యాట్‌కు తగిలిందా? లేదా? అనే విషయంలో అంపైర్లు అయోమయానికి లోనవుతుంటారు. అయితే బంతి బ్యాట్‌కు తగిలినపుడు వికెట్ కీపర్లకు, బ్యాట్స్‌మెన్‌కు దగ్గర ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లకు తెలిసిపోతుంటుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంత అనుభవం, నైపుణ్యం ఉన్నా బంతి బ్యాట్‌కు తగిలిందా? లేదా? అనే విషయంలో అంపైర్లు అయోమయానికి లోనవుతుంటారు. అయితే బంతి బ్యాట్‌కు తగిలినపుడు వికెట్ కీపర్లకు, బ్యాట్స్‌మెన్‌కు దగ్గర ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లకు తెలిసిపోతుంటుంది. అటువంటి సమయంలో అంపైర్ నిర్ణయాన్ని సమీక్షించేందుకు అందుబాటులోకి వచ్చిందే డీఆర్‌ఎస్ (DRS) నిర్ణయం. బంతికి కరెక్ట్‌గా అంచనా వేసి డీఆర్‌ఎస్ కోరడంలో చెన్నై (CSK) కెప్టెన్ ఎమ్‌ఎస్ ధోనీ (MS Dhoni) సమర్థుడు.

తాజాగా పంజాబ్ కెప్టెన్ (PBKS) శామ్ కర్రన్ (Sam Curran) కూడా తానేమీ తక్కువ కాదని నిరూపించాడు. గాయం కారణంగా పంజాబ్ రెగ్యులర్ కెప్టెన్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) తప్పుకోవడంతో శామ్ కర్రన్ శనివారం సాయంత్రం లఖ్‌నవూ‌తో (LSG) జరిగిన మ్యాచ్‌కు నాయకుడిగా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో కర్రన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అంతేకాదు లఖ్‌నవూ ఇన్నింగ్స్ 18వ ఓవర్లో డీఆర్‌ఎస్ కోరి స్టోయినిస్‌ను పెవిలియన్‌కు పంపాడు. కర్రన్ వేసిన బంతి లెగ్ సైడ్ వెళ్తుండగా స్టోయినిస్ దానిని ఆడేందుకు ప్రయత్నించాడు. ఆ బంతి నేరుగా వెళ్లి కీపర్ చేతిలో పడింది.

PBKSvsLSG: కేఎల్ రాహుల్ పట్టిన ఈ క్యాచ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో!

కర్రన్ వెంటనే అవుట్ కోసం అపీల్ చేశాడు. అయితే అంపైర్ ఆ బంతిని వైడ్‌గా ప్రకటించాడు. శామ్ వెంటనే డీఆర్‌ఎస్ కోరాడు. కీపర్‌తో సహా ఎవరికీ శామ్ నిర్ణయంపై నమ్మకం లేదు. అయితే రీప్లేలో ఆ బంతి బ్యాట్స్‌మెన్ గ్లౌస్‌కు తగిలినట్టు స్పష్టంగా కనబడింది. దీంతో స్టోయినిస్ అవుట్ అని అంపైర్ ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో లఖ్‌నవూపై పంజాబ్ టీమ్ రెండు వికెట్ల తేడాతో గెలుపొందింది.

Updated Date - 2023-04-16T10:20:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising