ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sanjay Manjrekar: కోహ్లీ బలం అదే.. ఆ మైండ్‌సెట్‌తో ఎప్పుడు ఆడినా కోహ్లీ విఫలం కాలేదు..!

ABN, First Publish Date - 2023-05-20T10:38:39+05:30

రాయల్ ఛాలెంజర్స్ స్టార్ విరాట్ కోహ్లీ గురువారం రాత్రి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో, భారీ స్కోర్ ఛేజింగ్‌లో కోహ్లీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. 62 బంతుల్లో వంద పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)స్టార్ విరాట్ కోహ్లీ (Virat Kohli) గురువారం రాత్రి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో, భారీ స్కోర్ ఛేజింగ్‌లో కోహ్లీ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్ ఆడాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRHvsRCB)తో జరిగిన మ్యాచ్‌లో 62 బంతుల్లో వంద పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. కోహ్లీ ఇన్నింగ్స్‌పై ప్రేక్షకులే కాదు.. మాజీ ఆటగాళ్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాడు. మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ (Sanjay Manjrekar) కూడా విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను మెచ్చుకున్నాడు.

``గురువారం కోహ్లీ తను ఎదుర్కొన్న మొదటి రెండు బంతులను బౌండరీకి తరలించాడు. కోహ్లీ సెంచరీలో మొదటి 16 పరుగులు బౌండరీల రూపంలోనే వచ్చాయి. గురువారం అతడు బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. దూకుడుగా ఆడే మైండ్ సెట్ కోహ్లీకి బలం. అలాంటి ఆలోచనా విధానంతో బ్యాటింగ్‌కు దిగినప్పుడల్లా కోహ్లీ రాణించాడు. ఎవరైనా ముందు సింగిల్స్ తీసి తర్వాత బౌండరీలు కొడతారు. కానీ, కోహ్లీ ముందు బౌండరీలు బాది ఒత్తిడి తగ్గించుకుంటాడు. ఆ తర్వాత సింగిల్స్‌, డబుల్స్‌తో ఇన్నింగ్స్‌ను నిర్మిస్తాడ``ని మంజ్రేకర్ అన్నాడు.

Trent Boult: ట్రెంట్ బౌల్ట్ సూపర్ క్యాచ్.. వీడియో వైరల్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

కోహ్లీ ఇలా ఆడితే అతడి టీ-20 కెరీర్ మరింత సుదీర్ఘంగా ఉంటుందని చెప్పాడు. కోహ్లీ ఫామ్‌లో ఉంటే ఆర్సీబీ చాలా భిన్నమైన టీమ్‌గా కనిపిస్తుందని, టాపార్డర్‌లో డుప్లెసి, కోహ్లీ, మ్యాక్స్‌వెల్ ఒకే తరహాలో ఆడుతున్నారని ప్రశంసించాడు. ప్లే ఆఫ్స్‌కు వెళ్లేందుకు ఆర్సీబీకి అన్ని అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడ్డాడు.

Updated Date - 2023-05-20T10:38:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising