KKR vs RCB: షారుక్ వచ్చాక ఇక తగ్గేదేలే.. ఈడెన్‌లో రెచ్చిపోయిన కోల్‌కతా టీమ్.. వైరల్ అవుతున్న ఫొటోలు!
ABN, First Publish Date - 2023-04-07T09:03:22+05:30
ఈ ఐపీఎల్ (IPL 2023)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) టీమ్ బోణీ చేసింది. బాలీవుడ్ బాద్ షా, కేకేఆర్ యజమాని షారుక్ (Shah Rukh Khan) ఎదురుగా స్ఫూర్తివంతమైన ప్రదర్శన చేసి తొలి విజయం అందుకుంది
ఈ ఐపీఎల్ (IPL 2023)లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) టీమ్ బోణీ చేసింది. బాలీవుడ్ బాద్ షా, కేకేఆర్ యజమాని షారుక్ (Shah Rukh Khan) ఎదురుగా స్ఫూర్తివంతమైన ప్రదర్శన చేసి తొలి విజయం అందుకుంది. గురువారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్‌లో 81 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)ను చిత్తుగా ఓడించింది. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం ఛేదనలో బెంగళూరు 17.4 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. కోల్‌కతా స్పిన్నర్లు చెలరేగి బెంగళూరు బ్యాట్స్‌మెన్ భరతం పట్టారు (KKR vs RCB).
దాదాపు మూడేళ్ల తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో (Eden Gardens) అడుగుపెట్టాడు. మ్యాచ్ ఆసాంతం షారుక్ తన టీమ్‌ను ఉత్సాహపరిచాడు. బ్యాట్స్‌మెన్ బౌండరీలు బాదినపుడు, బౌలర్లు వికెట్లు పడొగొట్టినపుడు వారికి అభినందనలు తెలుపుతూ సందడి చేశాడు. షారుక్ రాకతో కోల్‌కతా అభిమానులు పండగ చేసుకున్నారు. షారుక్‌ను చూసేందుకు అభిమానులు ఈడెన్‌కు పోటెత్తారు.
Sai Sudharsan: ఎవరీ సాయి సుదర్శన్.. క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచిన యువ ఆటగాడు.. మాజీల ప్రశంసలు..
శార్దూల్ ఠాకూర్ (Shardul Thakur) సూపర్ అర్ధ శతకంతో రాణించి ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు. అతడి సుడిగాలి ఇన్నింగ్స్‌తో కోల్‌కతా భారీ పరుగులు చేసింది. అనంతరం బెంగళూరును అరంగేట్రం స్పిన్నర్ సుయాశ్ శర్మ (Suyash Sharma) ఇబ్బందులు పెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే మూడు వికెట్లు తీశాడు. మిస్టరీ స్పిన్నర్ నరైన్‌కు (Sunil Narine) రెండు వికెట్లు లభించాయి
Updated Date - 2023-04-07T09:35:52+05:30 IST