Shikhar Dhawan: ఇప్పుడు మీకు సంతోషమేనా? నవ్వుతూనే హర్షా భోగ్లేకు చురకలు అంటించిన ధవన్..
ABN, First Publish Date - 2023-04-10T16:15:03+05:30
ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో (SRH) జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ (PBKS) ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు కెప్టెన్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) ఆడిన ఇన్నింగ్స్ మాత్రం ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మొదటి నుంచి చివరకు వరకు క్రీజులో నిలిచి అజేయంగా 99 పరుగులు చేశాడు. మ్యాచ్ అనంతరం కామేంటేటర్ హర్షా భోగ్లే (Harsha Bhogle).. ధవన్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ధవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
గత మ్యాచ్‌లో పంజాబ్ టీమ్ గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్ (RR) టీమ్‌తో తలపడి 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ధవన్ 56 బంతుల్లో 86 పరుగులు చేశాడు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ ఇన్నింగ్స్ అనంతరం ధవన్‌ను ఉద్దేశిస్తూ హర్షా భోగ్లే ఓ ట్వీట్ చేశాడు. ``శిఖర్ ధవన్ స్ట్రైక్ రేట్ (Strike Rate) చాలా తక్కువగా ఉంది. గౌహతి లాంటి బ్యాటింగ్ వికెట్‌పై శిఖర్ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడ``ని హర్షా భోగ్లే కామెంట్ చేశాడు.
Rinku Singh Bat: రింకూ బ్యాట్ వెనుక ఆసక్తికర కథ.. ఆ బ్యాట్ ఎవరిదో తెలిస్తే..
పంజాబ్ జట్టుకు శిఖర్ కీలక ఆటగాడని, అతడు వేగంగా ఆడాల్సిన అవసరం ఉందని హర్షా అభిప్రాయపడ్డాడు. దీంతో తాజాగా హైదరాబాద్‌తో ముగిసిన మ్యాచ్ అనంతరం హర్షాకు ధవన్ కౌంటర్ ఇచ్చాడు. మ్యాచ్ అనంతరం ధవన్‌ను హర్షా ఇంటర్వ్యూ చేసినపుడు ``ఇప్పుడు మీరు నా స్ట్రైక్ రేట్‌తో సంతోషంగా ఉన్నారనుకుంటా`` అని నవ్వుతూ అన్నాడు. ధవన్ మాటలకు హర్షా కూడా నవ్వేశాడు. ``కచ్చితంగా. ఈ మ్యాచ్‌లో మీరు ఆడిన ఇన్నింగ్స్ గొప్పది`` అని హర్షా కితాబిచ్చాడు.
Updated Date - 2023-04-10T16:15:03+05:30 IST