ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hetmyer: బౌండరీ లైన్ వద్ద హెట్‌మేయర్ అద్భుతం.. వేగంగా పరిగెడుతూ క్యాచ్ ఎలా తీసుకున్నాడో చూడండి..

ABN, First Publish Date - 2023-05-12T12:06:40+05:30

ఒక్క వికెట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది.. ఒక్క క్యాచ్ మ్యాచ్‌ను మలుపుతిప్పుతుంది.. ముఖ్యంగా పొట్టి క్రికెట్‌లో అయితే ఫీల్డింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. టీ-20 క్రికెట్‌లో ఆటగాళ్లు అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్క వికెట్ మ్యాచ్ స్వరూపాన్నే మార్చేస్తుంది.. ఒక్క క్యాచ్ మ్యాచ్‌ను మలుపుతిప్పుతుంది.. ముఖ్యంగా పొట్టి క్రికెట్‌లో అయితే ఫీల్డింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. టీ-20 క్రికెట్‌లో ఆటగాళ్లు అద్భుత ఫీల్డింగ్‌తో ఆకట్టుకుంటారు. బ్యాటర్లు భారీ షాట్ కొట్టి ధీమాగా నిల్చుంటే.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్లు అద్భుతాలు చేసి క్యాచ్‌లు పట్టుకుంటారు. లేదా బంతి బౌండరీ అవతల పడకుండా అడ్డుకుంటారు. ఇప్పటికే ఈ ఐపీఎల్‌లో (IPL 2023) ఎంతో మంది ఆటగాళ్లు అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యంతో ఆకట్టుకున్నారు.

తాజాగా కోల్‌కతా నైట్ రైడర్స్‌తో (KKR) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) ఆటగాడు హెట్‌మేయర్ (Shimron Hetmyer) బౌండరీ లైన్ వద్ద నమ్మశక్యం కాని రన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. కోల్‌కతా ఇన్నింగ్స్ మూడో ఓవర్లో ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) వేసిన బంతిని జేసన్ రాయ్ (Jason Roy) లెగ్ సైడ్ వైపు పుల్ చేశాడు. అది కచ్చితంగా బౌండరీయేనని అందరూ అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఫీల్డర్ లేడు. అయితే హెట్ మేయర్ దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి బౌండరీ రోప్‌నకు కొన్ని అంగుళాల దూరంలో ఆ బంతిని అందుకున్నాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Nitish Rana: కోల్‌కతా‌ను కావాలనే ఓడించావా?.. నువ్వేమైనా గొప్ప బౌలర్‌వా?.. నితీష్ రాణాపై దారుణ ట్రోలింగ్!

జేసన్ రాయ్ ఎంత ప్రమాదకర ఆటగాడో తెలిసింది. అప్పటికే రాయ్ మంచి టచ్‌లో కనిపించాడు. అయితే హెట్‌మేయర్ అద్భుతమైన క్యాచ్‌తో అతడిని పెవిలియన్‌కు పంపించాడు. ఆ తర్వాత కోల్‌కతా బ్యాటింగ్‌లో తడబడింది. వెంకటేష్ అయ్యర్ అర్ధశతకం సాధించడంతో అతి కష్టం మీద 20 ఓవర్లలో 149 పరుగులు చేసింది. ఆ తర్వాత జైస్వాల్ (Yashasvi Jaiswal) వీర విహారంతో రాజస్థాన్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది.

Updated Date - 2023-05-12T12:06:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising