ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shubman Gill: నువ్వు బౌలింగ్ వేస్తే సిక్స్ కొడతానని చెప్పా.. సెంచరీ అనంతరం శుభమన్ వ్యాఖ్యలు!

ABN, First Publish Date - 2023-05-16T09:10:32+05:30

గతేడాది ఛాంపియన్ టీమ్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లోనూ అదరగొడుతోంది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టీమ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గతేడాది ఛాంపియన్ టీమ్ గుజరాత్ టైటాన్స్ (GT) ఈ సీజన్‌లోనూ అదరగొడుతోంది. ఈ సీజన్‌లో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన తొలి జట్టుగా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. సోమవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో (GTvsSRH) గుజరాత్ టీమ్ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయం ప్లే ఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) సెంచరీతో అదరగొట్టాడు. 58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో గిల్‌కు ఇదే తొలి సెంచరీ (Gill Century). సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో సెంచరీ సాధించడంపై మ్యాచ్ అనంతరం గిల్ మాట్లాడాడు. ``సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో జరిగిన మ్యాచ్ ద్వారానే నేను ఐపీఎల్ అరంగేట్రం చేశాను. ఇప్పుడు నా తొలి సెంచరీ కూడా అదే టీమ్‌పై చేశాను. నా జీవితంలో ఓ సర్కిల్ పూర్తయినట్టు అనిపిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి సెంచరీలు మరిన్ని చేస్తాను. అభిషేక్ శర్మ (Abhishek Sharma) బౌలింగ్‌లో సిక్స్ కొట్టడం చాలా మజా ఇచ్చింది. నేను నీ బౌలింగ్‌లో ఆడితే కచ్చితంగా సిక్స్ కొడతాను అని అభిషేక్‌కు చెప్పాన``ని గిల్ పేర్కొన్నాడు. గతంలో పంజాబ్ స్టేట్ టీమ్‌కు గిల్, అభిషేక్ ఓపెనర్లుగా ఆడేవారు.

Sunil Gavaskar: షర్ట్ మీద కాదు.. గుండెల్లో.. ధోనీ ఆటోగ్రాఫ్ తీసుకున్న దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్!

సోమవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 188 పరుగులు చేసింది. గిల్ (101) సెంచరీ సాధించగా, సాయి సుదర్శన్‌ (47) ఆకట్టుకున్నాడు. భువనేశ్వర్‌ ఐదు వికెట్లతో మెరిశాడు. ఆ తర్వాత ఛేదనలో సన్‌రైజర్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 154 పరుగులు చేసి ఓడింది. క్లాసెన్‌ (44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 64), భువనేశ్వర్‌ (27) మాత్రమే రాణించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా గిల్‌ నిలిచాడు.

Updated Date - 2023-05-16T09:10:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising