Shubman Gill: తన పాత ఫ్రాంచైజీని వెక్కిరిస్తూ శుభ్‌మన్ గిల్ పోస్ట్.. హార్దిక్ పాండ్యా ఎలా స్పందించాడంటే..
ABN, First Publish Date - 2023-04-30T11:48:04+05:30
శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. 7 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుచేసి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరుకుంది.
శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై (KKR) గుజరాత్ టైటాన్స్ (GT) విజయం సాధించింది. 7 వికెట్లతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చిత్తుచేసి పాయింట్ల పట్టికలో అగ్ర స్థానానికి చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది. రహ్మనుల్లా గుర్బాజ్ (39 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్స్‌లతో 81) హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. అనంతరం ఛేజింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటాన్స్ 17.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది.
ఈ లీగ్‌లో సూపర్ ఫామ్‌లో ఉన్న గుజరాత్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) (49) ఈ మ్యాచ్‌లో కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో విజయ్ శంకర్ (51 నాటౌట్), మిల్లర్ (32 నాటౌట్) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 39 బంతుల్లో 87 పరుగులు జోడించి టైటాన్స్‌ను అలవోకగా గెలిపించారు. మ్యాచ్ అనంతరం గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వివాదాస్పద పోస్ట్ చేశాడు. మ్యాచ్‌లో తను షాట్లు కొడుతున్న ఫొటోలను షేర్ చేసి ``డే రైడర్స్`` (Day Rideres) అంటూ కామెంట్ చేసి బ్లూ హార్ట్ ఎమోజీని జత చేశాడు. గిల్ గతంలో నాలుగేళ్ల పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ తరఫున ఆడాడు.
IPL 2023: హైదరాబాద్ సూపర్ ఫీల్డింగ్.. ఢిల్లీపై విజయానికి కారణం అదే..
కారణమేంటో తెలియదు కానీ గిల్‌ను కోల్‌కతా వదిలేసింది. దాంతో గతేడాది నుంచి గుజరాత్ టీమ్‌కు ఆడుతున్నాడు. తన పాత ఫ్రాంఛైజీని వెక్కిరిస్తూనే గిల్ ఈ పోస్ట్ పెట్టాడని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. కాగా, గిల్ చేసిన ఈ పోస్ట్‌పై గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya) కూడా ఆసక్తికరంగా స్పందించాడు. గిల్ పోస్ట్‌కు స్పందిస్తూ రెడ్ హార్ట్, లాఫింగ్ ఎమోజీలను జత చేశాడు.
Updated Date - 2023-04-30T11:48:04+05:30 IST