ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Siraj vs Salt: ``సిరాజ్.. తీరు మార్చుకో``.. మ్యాచ్ సమయంలో సాల్ట్‌తో గొడవపై అభిమానుల స్పందన!

ABN, First Publish Date - 2023-05-07T09:30:58+05:30

బెంగళూరు స్ట్రైక్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 15 వికెట్లు తీశాడు. ఎకానమీ (7.7) కూడా చాలా మెరుగ్గా ఉంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు స్ట్రైక్ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 15 వికెట్లు తీశాడు. ఎకానమీ (7.7) కూడా చాలా మెరుగ్గా ఉంది. మ్యాచ్‌ల్లో మెరుగైన ప్రదర్శనే చేస్తున్నప్పటికీ ప్రవర్తన విషయంలో మాత్రం విమర్శలు ఎదుర్కొంటున్నాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక విలన్ అవుతున్నాడు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో (DCvsRCB) జరిగిన మ్యాచ్‌లో సిరాజ్ ప్రవర్తన చాలా మందికి ఆగ్రహం కలిగించింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన సిరాజ్.. సాల్ట్ (Phil Salt), వార్నర్‌ (David Warner)లతో గొడవపడ్డాడు. ఆ ఓవర్లో సిరాజ్ వేసిన మొదటి మూడు బంతులకు సాల్ట్ రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ కొట్టాడు. నాలుగో బంతి బాగా ఎత్తులో వైడ్ క్రీజుపై నుంచి వెళ్లింది. అయితే అంపైర్ దానిని వైడ్ బాల్‌గా ప్రకటించలేదు. దీంతో సాల్ట్.. లెగ్ అంపైర్ వైపు తిరిగాడు. లెగ్ అంపైర్ ఆ బంతిని చెక్ చేసి వైడ్‌గా ప్రకటించాడు. దీంతో సిరాజ్ వైపు తిరిగి సాల్ట్ ఏదో అన్నాడు. దీంతో సిరాజ్ టెంపర్ కోల్పోయి సాల్ట్‌ పైకి దూసుకెళ్లాడు (Siraj fight with salt).

Virat Kohli: విరాట్ కోహ్లీలో సరికొత్త కోణం.. ఢిల్లీలో చిన్న నాటి కోచ్ కాళ్లు మొక్కిన కోహ్లీ!

వారికి సర్ది చెప్పేందుకు వచ్చిన వార్నర్‌కు సిరాజ్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత సాల్ట్ వైపు చూస్తూ తన నోటిపై వేలు పెట్టి సైగ చేశాడు. ఆ సమయంలో బెంగళూరు కెప్టెన్ డుప్లెసి, అంపైర్ వచ్చి సిరాజ్‌ను వెనక్కి తీసుకెళ్లిపోయారు. ఈ గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అయింది. తన ప్రవర్తనతో సిరాజ్ చాలా మందికి చిరాకు కలిగిస్తున్నాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రపంచ స్థాయి బౌలర్‌గా ఎదగాలంటే ప్రవర్తన మార్చుకోవాలని హితువు చెబుతున్నారు.

Updated Date - 2023-05-07T09:30:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising