Sreesanth: ధోనీ ఎప్పుడూ అలా చేయలేదు.. అప్పుడే ఎందుకు రిటైర్ అయ్యాడో.. శ్రీశాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ABN, First Publish Date - 2023-05-12T09:48:01+05:30
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఎమ్ఎస్ ధోనీ కొద్ది రోజులుగా మోకాలి గాయంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. మోకాలి గాయంతోనే ధోనీ ఈ ఐపీఎల్ ఆడుతున్నాడు. తాను స్వయంగా రాణిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కు విజయాలు అందిస్తున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఎమ్ఎస్ ధోనీ (MS Dhoni) కొద్ది రోజులుగా మోకాలి గాయంతో (Dhoni knee injury) బాధపడుతున్న సంగతి తెలిసిందే. మోకాలి గాయంతోనే ధోనీ ఈ ఐపీఎల్ (IPL 2023) ఆడుతున్నాడు. తాను స్వయంగా రాణిస్తూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) టీమ్‌కు విజయాలు అందిస్తున్నాడు. ఫినిషర్‌గా అద్భుతమైన పాత్ర పోషిస్తున్నాడు. అయితే మోకాలి గాయం వల్ల వికెట్ల మధ్య పరిగెత్త లేకపోతున్నాడు. వికెట్ల మధ్య పరిగెత్తడంలో ఛాంపియన్ అయిన ధోనీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే గుండె పగిలిపోతోందని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ట్విటర్‌లో పేర్కొన్నాడు.
ధోనీ ఫిట్‌నెస్ గురించి మరో మాజీ క్రికెటర్ శ్రీశాంత్ (Sreesanth) కూడా తన అభిప్రాయాలను పంచుకున్నాడు. ``గతంలో కూడా ధోనీ మైదానంలో ఆడుతున్న సమయంలో చాలా సార్లు గాయపడ్డాడు. కానీ, ఎప్పుడూ పెయిన్ కిల్లర్లు (Pain killers) తీసుకునేవాడు కాదు. నొప్పితోనే ఆడేవాడు. మ్యాచ్ అయిన తర్వాతే చికిత్స తీసుకునేవాడు. ఎందుకు పెయిన్ కిల్లర్స్ వేసుకోవు అని అడిగితే.. ``గాయాన్ని ప్రదర్శించడం నాకు ఇష్టం లేదు. నాకు పెయిన్ ఉందని ఎవరికీ తెలియనవసరం లేద``ని చెప్పేవాడ``ని శ్రీశాంత్ పేర్కొన్నాడు.
Yashaswi Jaiswal: బట్లర్ త్యాగం.. జైస్వాల్ వీరంగం.. బంతిని ఎంతలా బాదాడో చూశారా.. వైరల్ అవుతున్న వీడియో!
ఇప్పటికీ చాలా మంది క్రికెటర్లు 42 ఏళ్ల వయసులో కూడా ఆడుతున్నారని, 40 ఏళ్లకే ధోనీ రిటైర్మెంట్ ఇవ్వడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందని శ్రీశాంత్ అన్నాడు. ధోనీ చాలా ఫిట్‌గా ఉంటాడని, మోకాలి గాయం అతడిని పెద్దగా ఇబ్బంది పెట్టలేదని అన్నాడు. కాగా, ధోనీ గాయం కారణంగానే పరుగుల కోసం ప్రయత్నించకుండా బౌండరీలు కొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు.
Updated Date - 2023-05-12T09:48:01+05:30 IST