ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sai Sudharsan: ఎవరీ సాయి సుదర్శన్.. క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచిన యువ ఆటగాడు.. మాజీల ప్రశంసలు..

ABN, First Publish Date - 2023-04-05T10:14:48+05:30

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. రిషభ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్ వంటి ఎందరో ట్యాలెంటెడ్ క్రికెటర్స్ ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) ద్వారా ఎంతో మంది యువ ఆటగాళ్ల ప్రతిభ వెలుగులోకి వచ్చింది. రిషభ్ పంత్, సూర్య కుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, మహ్మద్ సిరాజ్ వంటి ఎందరో ట్యాలెంటెడ్ క్రికెటర్స్ ఐపీఎల్ ద్వారానే వెలుగులోకి వచ్చి జాతీయ జట్టులో కూడా స్థానం సంపాదించుకున్నారు. తాజా ఐపీఎల్‌లో కూడా ఇద్దరు కుర్రాళ్లు బాగా ఆకట్టుకుంటున్నారు. వారిలో మొదటి వ్యక్తి తిలక్ వర్మ (MI) కాగా, రెండో వ్యక్తి సాయి సుదర్శన్ (Sai Sudharsan).

ఢిల్లీతో మంగళవారం జరిగిన మ్యాచ్ (DCvsGT) చూసిన వారెవరూ సాయి సుదర్శన్ ఆటతీరును అంత త్వరగా మర్చిపోలేరు. స్టార్ ఆటగాళ్లందరూ వెనుదిరుగుతున్నా సాయి సుదర్శన్ మాత్రం క్రీజులో పాతుకుపోయి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. నిజానికి చెన్నైతో (CSK) జరిగిన మ్యాచ్‌లోనే 22 పరుగులు చేసిన సుదర్శన్ చాలా మందిని ఆకట్టుకున్నాడు. దీంతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సుదర్శన్‌కు గుజరాత్ యాజమాన్యం తుదిజట్టులో స్థానం కల్పించింది. ఆ అవకాశాన్ని సాయిసుదర్శన్ పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. కుల్‌దీప్, నోకియా లాంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లను ఎదుర్కొని 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

DCvsGT: వామ్మో.. రాహుల్ కళ్లు చెదిరే క్యాచ్.. ఈ వీడియో చూస్తే మెచ్చుకోకుండా ఉండలేరు..!

సాయి సుదర్శన్ ఆటతీరుపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) ప్రశంసలు కురిపించాడు. ప్రపంచ స్థాయి ఆటగాడికి ఉండాల్సిన లక్షణాలన్నీ సుదర్శన్‌కు ఉన్నాయని గవాస్కర్ కొనియాడాడు. తమిళనాడుకు చెందిన సుదర్శన్ దేశవాళీ మ్యాచ్‌ల్లో గతేడాది అద్భుతంగా రాణించాడు. దీంతో గుజరాత్ అతడిని కేవలం రూ.20 లక్షల నామమాత్రపు ధరకే దక్కించుకుంది.

Updated Date - 2023-04-05T10:14:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising