ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Brian Lara: అందుకే గెలవలేకపోతున్నాం.. హైదరాబాద్ ప్రదర్శనపై కోచ్ లారా తీవ్ర అసహనం..

ABN, First Publish Date - 2023-04-08T12:34:21+05:30

సీజన్లు మారుతున్నా సన్‌రైజర్స హైదరాబాద్ జట్టు తీరు మారడం లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతూనే ఉంది. పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో మ్యాచ్‌లను చేజార్చుకుంటోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

సీజన్లు మారుతున్నా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SunRisers Hyderabad) జట్టు తీరు మారడం లేదు. వరుస పరాజయాలతో సతమతమవుతూనే ఉంది. పేలవ బ్యాటింగ్ ప్రదర్శనతో మ్యాచ్‌లను చేజార్చుకుంటోంది. ఈ సీజన్‌లో (IPL 2023) ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ (RR) చేతిలోనూ, శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ (LSG) చేతిలోనూ దారుణ పరాజయాలను మూటగట్టుకుంది.

హైదరాబాద్ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆ జట్టు హెడ్ కోచ్ బ్రియాన్ లారా (Brian Lara) అసంతృప్తి వ్యక్తం చేశాడు. చెత్త బ్యాటింగ్ వల్లే ఓడిపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ``ఈ సీజన్‌లో మా బ్యాటింగ్ ప్రదర్శన బాగాలేదు. తొలి మ్యాచ్‌లో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయాం. లఖ్‌నవూతో జరిగిన మ్యాచ్‌లో ఏడు బంతుల వ్యవధిలోనే మూడు వికెట్లు పడ్డాయి. దీంతో మ్యాచ్ స్వరూపం మొత్తం మారిపోయింది. ఇకపై బ్యాటర్ల తీరు మారకుంటే చాలా కష్టమవుతుంద``ని లారా అన్నాడు.

Mohammad Kaif: ఆరోజు కోహ్లీ ప్రవర్తన షాక్ కలిగించింది.. విరాట్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన మహ్మద్ కైఫ్!

లోపాలు సరి చేసుకుంటేనే మెరుగైన ఫలితాలు వస్తాయని లారా పేర్కొన్నాడు. హైదరాబాద్ ఎన్నో ఆశలు పెట్టుకుని భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిన మార్‌క్రమ్ (Aiden Markram), హ్యారీ బ్రూక్ (Harry Brook) విఫలమవుతుండడం తలనొప్పులు తెచ్చిపెడుతోంది. మరోవైపు బౌలర్లు కూడా అనుకున్న స్థాయిలో రాణించలేకపోతున్నారు.

Updated Date - 2023-04-08T12:34:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising