ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sunrisers vs Royal Challengers: 6 సిక్సర్లు బాదిన క్లాసెన్.. ఆర్సీబీ లక్ష్యం ఎంతంటే...

ABN, First Publish Date - 2023-05-18T21:24:23+05:30

ప్లే ఆఫ్స్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore) బ్యాట్స్‌మెన్ అదరగొట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్లే ఆఫ్స్ రేసులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు అత్యంత కీలకమైన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad vs Royal Challengers Bangalore) బ్యాట్స్‌మెన్ రాణించారు. ముఖ్యంగా మంచి ఫామ్‌లో ఉన్న హెన్రిచ్ క్లాసెన్ (Heinrich Klaasen) మరోసారి మెరిశాడు. ఆర్సీబీ బౌలర్లపై ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీతో కదం తొక్కాడు. కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 104 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే క్లాసెన్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. అయినప్పటికీ క్లాసెన్ శతకం పుణ్యమా అని సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు అభిషేక్ శర్మ (11), రాహుల్ త్రిపాఠి (15) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ ఏడెన్ మార్క్రమ్ (18), హ్యారీ బ్రూక్ (27 నాటౌట్), గ్లేన్ ఫిలిప్ (5) చొప్పున పరుగులు చేశారు. కాగా బెంగళూరు బౌలర్లలో మిచెల్ బ్రేస్ 2 వికెట్లు, మహ్మద్ సిరాజ్, షాబాజ్ అహ్మద్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీశారు.

కాగా ఐపీఎల్ 2023 సీజన్ ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. లేదంటే అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి. మరి 187 పరుగుల లక్ష్య చేధనలో ఆర్సీబీ బ్యాట్స్‌మెన్ ఏ మేరకు రాణిస్తారో వేచిచూడాలి.

Updated Date - 2023-05-18T21:26:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising