Surya Kumar Yadav: సూర్య ఫామ్‌లోకి వస్తే ఆపడం కష్టం.. మైదానం నలువైపులా ఎలాంటి షాట్లు కొట్టాడో చూడండి..
ABN, First Publish Date - 2023-05-10T10:36:50+05:30
దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ తర్వాత ఆ స్థాయిలో మైదానం నలువైపులా షాట్లు కొట్టగల ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. ఈ ఏడాది ఆరంభంలో ఫామ్ కోల్పోయి తంటాలు పడినప్పటికీ ప్రస్తుత ఐపీఎల్‌లో మళ్లీ మునపటి సూర్యను తలపిస్తున్నాడు.
దక్షిణాఫ్రికా ఆటగాడు ఏబీ డివిల్లియర్స్ తర్వాత ఆ స్థాయిలో మైదానం నలువైపులా షాట్లు కొట్టగల ఆటగాడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav). ఈ ఏడాది ఆరంభంలో ఫామ్ కోల్పోయి తంటాలు పడినప్పటికీ ప్రస్తుత ఐపీఎల్‌లో మళ్లీ మునపటి సూర్యను తలపిస్తున్నాడు. ముఖ్యంగా మంగళవారం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (RCBvsMI) మునుపటి సూర్యను తలపించాడు. మైదానం నలువైపులా నమ్మశక్యం కాని షాట్లు కొడుతూ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై సూర్య బ్యాటింగ్ కారణంగా సునాయాసంగా విజయం సాధించింది. సూర్య (35 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 83) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో ముంబై టీమ్ 21 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. ఐపీఎల్ చరిత్రలో 200 పరుగుల ఛేదనను ఓ జట్టు ఇంత వేగంగా పూర్తి చేయడం ఇదే తొలిసారి. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ముంబైకిది మూడో 200+ ఛేదన కావడం విశేషం. అలాగే ఎనిమిదో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ ఏకంగా మూడో స్థానానికి ఎగబాకింది.
MS Dhoni Retirement: ధోనీ రిటైర్మెంట్‌పై సురేష్ రైనా కీలక అప్‌డేట్.. వైరల్ అవుతున్న రైనా వ్యాఖ్యలు!
సూర్యకుమార్, నేహాల్ వధేరా (Nehal Wadhera) (52 నాటౌట్) ఆర్‌సీబీ బౌలర్లను చెడుగుడు ఆడేశారు. ముంబై జట్టు తరఫున ఏ వికెట్‌కైనా రికార్డు భాగస్వామ్యం (140) అందించారు. సూర్య ఎడాపెడా బౌండరీలతో వాంఖడేను హోరెత్తించాడు. ప్రతి ఓవర్లోనూ బౌండరీలు బాది ప్రేక్షకులను అలరించాడు. ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌కు గానూ ``ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్``గా నిలిచాడు.
Updated Date - 2023-05-10T10:36:50+05:30 IST