Surya Kumar Yadav: అటు నాయకుడిగా, ఇటు ఆటగాడిగా సత్తా చాటిన సూర్య.. మ్యాచ్ అనంతరం ఏమన్నాడంటే..
ABN, First Publish Date - 2023-04-17T12:10:49+05:30
గతేడాది సూపర్‌ఫామ్‌తో అదరగొట్టిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ ఈ ఏడాది ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండా వికెట్ పారేసుకున్నాడు
గతేడాది సూపర్‌ఫామ్‌తో అదరగొట్టిన డాషింగ్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఈ ఏడాది ఫామ్ కోల్పోయి తంటాలు పడ్డాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో ఒక్క పరుగు కూడా చేయకుండా వికెట్ పారేసుకున్నాడు. అదే పేలవ ప్రదర్శనలను ఐపీఎల్ (IPL 2023) ఆరంభ మ్యాచ్‌ల్లో కూడా కొనసాగించాడు. గత ఆరు మ్యాచ్‌ల్లో సూర్య 0 (1), 0 (1), 0 (1), 15 (16), 1 (2), 0 (1) పరుగులు మాత్రమే చేశాడు. అయితే ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో (KKRvsMI) మునుపటి సూర్య కనిపించాడు.
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగడంతో ముంబై టీమ్‌కు సూర్య కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య మొదట్లో ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత గేరు మార్చి సిక్స్‌లు, ఫోర్లతో హోరెత్తించాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 43 పరుగులు చేశాడు. ఆటగాడిగానే కాదు.. కెప్టెన్‌గా కూడా సూర్య సత్తా చాటాడు. కేకేఆర్‌పై సూర్య నాయకత్వంలోని ముంబై జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం సూర్య మాట్లాడాడు.
MIvsKKR: జహీర్ ఖాన్ ఇంటర్వ్యూ ఇస్తుండగా రోహిత్, ఇషాన్ కిషన్ ఏం చేశారో చూడండి.. వైరల్ అవుతున్న ఫన్నీ వీడియో!
``ఈ మ్యాచ్ మొత్తం మా ప్లాన్ ప్రకారమే జరిగింది. ఈ మ్యాచ్‌లో ప్రశాంతంగా ఆడాలని నిర్ణయించుకున్నా. మొదటి ఆరేడు బంతుల వరకు షాట్లు ప్రయత్నించకూడదని క్రీజులోకి వచ్చేటపుడే అనుకున్నా. ఒకవైపు ఇషాన్ (Ishan Kishan) భారీ షాట్లు కొడుతుండడంతో నాపై ఒత్తిడి లేదు. దాంతో నేను రిలాక్స్‌డ్‌గా ఆడాను. క్రీజులో కుదురుకున్నాక భారీ షాట్లు కొట్టాను. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా మా టీమ్ ఇదే స్ఫూర్తిని కొనసాగించాల``ని సూర్య ఆశాభావం వ్యక్తం చేశాడు.
Updated Date - 2023-04-17T12:10:49+05:30 IST