ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sweet 16 IPL : స్వీట్‌ 16 పిలుస్తోంది!

ABN, First Publish Date - 2023-03-31T03:10:53+05:30

వన్డే ప్రపంచక్‌పనకు టీమిండియా సన్నాహకాలను కాసేపు మర్చిపోదాం.. సూర్య భగవానుడి ప్రతాపానికి హీటెక్కుతున్న వాతావరణాన్నీ బేఖాతరు చేద్దాం.. ఎందుకంటే.. క్రికెట్‌ ప్రేమికులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

నేటి నుంచే ఐపీఎల్‌

పదహారో సీజన్‌ రాత్రి 7.30నుంచి స్టార్‌స్పోర్ట్స్‌, జియో సినిమాలో...

ప్రైజ్‌మనీ

విజేతకు : రూ. 20 కోట్లు

రన్నర్‌పనకు: రూ. 13 కోట్లు

ప్లే ఆఫ్‌ జట్లకు (2): చెరి రూ. 7 కోట్లు

వన్డే ప్రపంచక్‌పనకు టీమిండియా సన్నాహకాలను కాసేపు మర్చిపోదాం.. సూర్య భగవానుడి ప్రతాపానికి హీటెక్కుతున్న వాతావరణాన్నీ బేఖాతరు చేద్దాం.. ఎందుకంటే.. క్రికెట్‌ ప్రేమికులను పరుగుల జడివానలో ముంచేందుకు ఐపీఎల్‌ సిద్ధమైంది. పదిహేనేళ్లుగా అందరిలోనూ అదే ఉత్సాహం.. అదే ఉద్వేగాన్ని సజీవంగా నిలుపుకొంటూ తాజాగా 16వ సీజన్‌కు తెర లేవనుంది. ఇక ఫ్యాన్స్‌కు మైదానంలో ఆడేది మనవాడైనా.. పరాయి దేశస్థుడినైనా ఒక్కటే. బ్యాటర్ల వీర బాదుడు.. ఫీల్డర్ల మెరుపు విన్యాసాలు.. బౌలింగ్‌ ధీరుల మాయాజాలంతో స్టేడియాలు హోరెత్తిపోవడమే తరువాయి. దాదాపు రెండు నెలల పాటు సోషల్‌ మీడియా ఊసులకు టాటా చెప్పండిక.. మ్యాచ్‌ మ్యాచ్‌లోనూ ఉత్కం‘టై’ ఊపేస్తుండగా.. ఆఖరి ఓవర్ల మజాను ఊపిరి బిగపడుతూ ఆస్వాదించండి.. మిమ్మల్ని అలరించేందుకు ఐపీఎల్‌ వీరులు రెడీగా ఉన్నారు.. మరి మీరు సిద్ధమేనా..!

అహ్మదాబాద్‌: పది ఫ్రాంచైజీలు.. 12 వేదికలు.. 74 మ్యాచ్‌లు.. దాదాపు 60 రోజులు.. ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులకు కావాల్సినంత వినోదమిక. ఈ ఏడాది చివర్లో భారత్‌లోనే జరిగే వన్డే ప్రపంచకప్‌ మెగా టోర్నీకి ముందే మరో భారీ పరుగుల పండుగ ఇది. అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 16వ సీజన్‌కు అంతా సిద్ధమైంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌-చెన్నై సూపర్‌ కింగ్స్‌ మధ్య నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌ ద్వారా ఈ ధనాధన్‌ పోరు ఆరంభం కానుంది. ఇప్పటిదాకా జాతీయ జట్టులో సహచరులుగా కలిసి ఆడిన వారే ఇక ప్రత్యర్థులుగా మారి సవాల్‌ విసురుకోబోతున్నారు. అటు ఫ్యాన్స్‌ కూడా తమ ఫ్రాంచైజీల వారీగా విడిపోయి విదేశీ ఆటగాళ్లకు సైతం మద్దతు పలికేందుకు సిద్ధమవుతున్నారు. గతేడాది డిసెంబరులో జరిగిన వేలం ద్వారా పది జట్లు కొత్త రూపును సంతరించుకున్నాయి. చెన్నైకి ఆడిన సామ్‌ కర్రాన్‌ను ఏకంగా రూ.18.50 కోట్లకు పంజాబ్‌ తీసుకోగా.. స్టోక్స్‌ రూ.16.25 కోట్లకు చెన్నైకి వచ్చాడు. ఇక సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా ఉన్న విలియమ్సన్‌ గుజరాత్‌ బ్యాటర్‌గా మారాడు. పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో దూరమైనా.. ఏమాత్రం కళ తప్పని ఈ లీగ్‌లో స్టార్‌ ప్లేయర్లతో పాటు యువతరం కూడా తమ స్థాయి ప్రదర్శనతో ముగ్ధులను చేయబోతున్నారు. కాగా ప్లే ఆఫ్‌లు, ఫైనల్‌ మ్యాచ్‌ తేదీలను తర్వాత ప్రకటిస్తారు.

ఈసారి సరికొత్తగా..: 2019 తర్వాత ఐపీఎల్‌ ఇంటా, బయటా మ్యాచ్‌లతో జరగనున్నాయి. ప్రతీ టీమ్‌ సొంత గడ్డపై, ప్రత్యర్థి మైదానాల్లో ఏడేసి మ్యాచ్‌లు ఆడతాయి. ఆటకు మరింత ఆకర్షణ జత చేసేందుకు ఇంపాక్ట్‌ ప్లేయర్‌ రాబోతున్నాడు. టాస్‌ సమయంలో తుది జట్టుతో పాటు నలుగురు సబ్‌స్టిట్యూట్స్‌ను ప్రకటించాల్సి ఉంటుంది. మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్టుగా ఆయా కెప్టెన్లు మైదానంలో ఉన్న ఆటగాడికి బదులు ఇంపాక్ట్‌ ఆటగాడిని దించవచ్చు. పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తుందనుకుంటే.. బ్యాటర్‌ను మార్చి స్పిన్నర్‌ను తీసుకోవచ్చు. అలాగే ఛేదనలో ఎక్స్‌ట్రా బ్యాటర్‌ అవసరమనుకుంటే ఓ బౌలర్‌ను తప్పించి మరో బ్యాటర్‌ను ఆడించవచ్చు. కానీ తుది జట్టులో నలుగురు విదేశీ ఆటగాళ్లుంటే మాత్రం భారత ఆటగాడే ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా వస్తాడు. అలాగే ముఖ్యమైన మార్పు అంటే.. టాస్‌ వేశాక కూడా తుది జట్లను మార్చుకునే వెసులుబాటు కల్పించడం. దీంతో టాస్‌ గెలిచిన జట్టుకు పెద్దగా అదనపు ప్రయోజనం ఉండదు. దీనికి తోడు ఈ సీజన్‌ నుంచి నోబాల్‌, వైడ్లపై కూడా రివ్యూను కోరవచ్చు. డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటికే దీన్ని అమలు చేశారు.

గ్రూప్‌ ఎ

ముంబై, కోల్‌కతా, రాజస్థాన్‌, ఢిల్లీ, లఖ్‌నవూ

గ్రూప్‌ బి

చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, పంజాబ్‌, గుజరాత్‌

పది జట్లను రెండు భాగాలుగా చేసి మ్యాచ్‌లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. క్రితంలాగే ప్రతి జట్టూ లీగ్‌ దశలో 14 మ్యాచ్‌లు ఆడుతుంది. అయితే ఈసారి స్వల్ప మార్పు చోటుచేసుకుంది. ప్రతీ జట్టు తమ గ్రూపులోని నాలుగు జట్లతో ఒక్కోసారి, అవతలి గ్రూప్‌లోని అయిదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది.

ఐపీఎల్‌ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్‌ ఫొటోలో ముంబై సారథి రోహిత్‌ శర్మలేక పోవడం చర్చనీయాంశమైంది. అయితే స్వల్ప అస్వస్థత కారణంగా అతను అహ్మదాబాద్‌ రాలేకపోయాడని, ఏప్రిల్‌ 2న జరిగే తొలి మ్యాచ్‌నాటికి సిద్ధమవుతాడని సమాచారం.

Updated Date - 2023-03-31T03:10:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising