GTvsRR: సాహా క్యాచ్ కోసం ఎంత మంది పరిగెత్తారో.. చివరకు ఆ క్యాచ్ ఎలా పట్టారో చూడండి..!
ABN, First Publish Date - 2023-04-17T08:26:25+05:30
క్రికెట్‌లో అప్పుడప్పుడు ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ఒక క్యాచ్ పట్టడానికి ఇద్దరు వెళ్లి ఢీకొని క్యాచ్ నేల పాలు చేసిన ఘటనలు చాలా చూసి ఉంటాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో అలాంటి ఘటనే జరిగింది.
క్రికెట్‌లో అప్పుడప్పుడు ఫన్నీ సంఘటనలు జరుగుతుంటాయి. ఒక క్యాచ్ (Catch) పట్టడానికి ఇద్దరు వెళ్లి ఢీకొని క్యాచ్ నేల పాలు చేసిన ఘటనలు చాలా చూసి ఉంటాయి. తాజాగా గుజరాత్ టైటాన్స్ (GT), రాజస్థాన్ రాయల్స్ (RR) మధ్య జరిగిన మ్యాచ్‌లో అలాంటి ఘటనే జరిగింది. రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ (Sanju Samson) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదటి ఓవర్ ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) బౌలింగ్ చేశాడు. గుజరాత్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (Wriddhiman Saha) రెండో బంతినే ఫోర్‌కు తరలించాడు.
బౌల్ట్ వేసిన మూడో బంతిని స్క్వేర్ లెగ్ దిశగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే టైమింగ్ సరిగ్గా కుదరకపోవడంతో బంతి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి గాల్లోకి లేచింది. ఆ బంతిని పట్టుకునేందుకు శాంసన్, హెట్‌మెయర్, ధ్రువ్ పరిగెత్తారు. ముగ్గురూ ఒకరినొకరు ఢీకొన్నారు. బంతి శాంసన్ గ్లౌస్ నుంచి జారిపోతుండగా అక్కడే నిల్చుని ఉన్న బౌల్ట్ వెంటనే పట్టుకున్నాడు. ఈ క్యాచ్ అనంతరం ఆటగాళ్లందరూ నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.
PBKSvsLSG: కేఎల్ రాహుల్ పట్టిన ఈ క్యాచ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. వైరల్ అవుతున్న వీడియో!
ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో (GTvsRR) గుజరాత్ టైటాన్స్‌పై రాజస్థాన్ టీమ్ 3 వికెట్ల తేడాతో గెలిచింది. ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి ఓటమి ఖాయమనే స్థితి నుంచి కెప్టెన్ శాంసన్ (32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 60), హెట్‌మయెర్ (26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 నాటౌట్) చెలరేగడంతో రాజస్థాన్ రేసులోకి వచ్చింది. మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.
Updated Date - 2023-04-17T08:26:25+05:30 IST