ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

KL Rahul: కేఎల్ రాహుల్ ఇంత స్వార్థపరుడా? నెట్టింట రాహుల్‌పై భారీగా ట్రోలింగ్.. కారణమేంటంటే..

ABN, First Publish Date - 2023-04-08T14:30:38+05:30

కేఎల్ రాహుల్‌పై సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయమై ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. ప్రేమ వ్యవహారం విషయంలోనూ, బాగా ఆడకపోయినా జట్టులో అవకాశం పొందడం విషయంలోనూ రాహుల్‌పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కేఎల్ రాహుల్‌పై (KL Rahul) సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయమై ట్రోలింగ్ (Trolling on KL Rahul) జరుగుతూ ఉంటుంది. ప్రేమ వ్యవహారం విషయంలోనూ, బాగా ఆడకపోయినా జట్టులో అవకాశం పొందడం విషయంలోనూ రాహుల్‌పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వచ్చాయి. తాజాగా ఐపీఎల్‌లో (IPL 2023) రాహుల్ తీసుకున్న ఓ నిర్ణయం నెటిజన్లకు నచ్చలేదు. దీంతో మళ్లీ రాహుల్‌పై ట్రోలింగ్ మొదలైంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌తో (SRH) రాహుల్ నేతృత్వంలోని లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) టీమ్ తలపడింది.

122 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లఖ్‌నవూ టీమ్ విజయం సాధించింది. పూర్తిగా బౌలింగ్‌కు సహకరించిన పిచ్‌పై రాహుల్ జాగ్రత్తగా ఆడుతూ 30 బంతుల్లో 35 పరుగులు చేశాడు. చివరకు 15వ ఓవర్లో రషీద్ బౌలింగ్‌లో రివర్స్-స్వీప్ కోసం ప్రయత్నించి వికెట్ల ముందు దొరికిపోయాడు. రషీద్ అపీల్ చేయడంతో అంపైర్ వెంటనే ఔట్ ఇచ్చాడు. తను అవుట్ అని రాహుల్‌కు కూడా స్పష్టంగా తెలిసినట్టు అతడి బాడీ లాంగ్వేజ్ చూస్తే అర్థమవుతోంది. అయినా రాహుల్ అంపైర్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ డీఆర్‌ఎస్ (DRS) కోరాడు.

Brian Lara: అందుకే గెలవలేకపోతున్నాం.. హైదరాబాద్ ప్రదర్శనపై కోచ్ లారా తీవ్ర అసహనం..

డ్రెస్సింగ్ రూమ్ వైపు నడుస్తూనే డీఆర్ఎస్ అడగడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ముందుగా అనుకున్నట్టుగానే రాహుల్ అవుట్ అని డీఆర్‌ఎస్‌లో తేలింది. దీంతో రాహుల్ పెవిలియన్ చేరాడు. ఉపయోగం ఉండదని తెలిసినా కూడా ఒక అవకాశాన్ని రాహుల్ తన కోసం ఉపయోగించుకున్నాడని రాహుల్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాహుల్ బాగా స్వార్థపరుడంటూ (Selfish) కొందరు కామెంట్లు చేస్తున్నారు. కెప్టెన్ కాబట్టి రాహుల్ తనకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడని మరికొందరు పేర్కొన్నారు.

Updated Date - 2023-04-08T14:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising