ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MS Dhoni: ధోనీ రివ్యూ అడిగితే మామూలుగా ఉండదు.. అద్భుతంగా క్యాచ్ పట్టడమే కాదు సూర్యను ఎలా ఔట్ చేశాడో చూడండి..

ABN, First Publish Date - 2023-04-09T08:16:02+05:30

ప్రపంచ క్రికెట్లో డీఆర్ఎస్‌ను సమర్థవంతంగా వినియోగించుకున్న కెప్టెన్లలో ధోనీ ముందు వరసలో ఉంటాడు. అనవసరంగా డీఆర్‌ఎస్ కోరడం, ఒకవేళ ధోనీ అడిగితే అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం చాలా అరుదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ప్రపంచ క్రికెట్లో డీఆర్ఎస్‌ను (DRS decision) సమర్థవంతంగా వినియోగించుకున్న కెప్టెన్లలో ధోనీ (MS Dhoni) ముందు వరసలో ఉంటాడు. అనవసరంగా డీఆర్‌ఎస్ కోరడం, ఒకవేళ ధోనీ అడిగితే అంపైర్ తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడం చాలా అరుదు. అందుకే డీఆర్‌ఎస్‌ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్ అనే పేరు వచ్చింది. తాజాగా ముంబై ఇండియన్స్‌తో (MI) జరిగిన మ్యాచ్‌లో ధోనీ సూర్యకుమార్ యాదవ్‌ను (Suryakumar Yadav) ఇదే తరహాలో పెవిలియన్‌కు పంపించాడు. ధోనీ నిర్ణయంపై ట్విటర్‌లో ప్రశంసలు కురుస్తున్నాయి.

ముంబై ఇన్నింగ్స్‌ 8వ ఓవర్లో సూర్యకుమార్ బ్యాటింగ్ చేస్తుండగా శాంట్నర్ వేసిన బంతి లెగ్ సైడ్ వైపు వెళుతూ అతడి గ్లౌస్‌ను చిన్నగా తాకింది. ధోనీ ఆ బంతిని రెప్ప పాటులో అందుకుని అప్పీల్ చేశాడు. అయితే అంపైర్ మాత్రం ఔట్ ఇవ్వలేదు. దీంతో వెంటనే ధోనీ డీఆర్‌ఎస్ అడిగాడు. రీప్లేలో ఆ బంతి సూర్య గ్లౌస్‌కు తగిలినట్టు కనబడింది. దీంతో సూర్య పెవిలియన్‌కు చేరక తప్పలేదు.

KL Rahul: కేఎల్ రాహుల్ ఇంత స్వార్థపరుడా? నెట్టింట రాహుల్‌పై భారీగా ట్రోలింగ్.. కారణమేంటంటే..

ధోనీ డీఆర్‌ఎస్‌ను వాడుకునే విధానంపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ ప్రత్యక్షమయ్యాయి. ధోనీ కనుక డీఆర్‌ఎస్ అడిగితే ప్లేయర్ నిర్మొహమాటంగా పెవిలియన్‌కు వెళ్లిపోవచ్చని ఒకరు కామెంట్ చేశారు. ధోనీ ముందు అంపైరింగ్ చేయడం సవాలుతో కూడిన పని అని కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Updated Date - 2023-04-09T08:16:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising