David Warner: వార్నర్ ఇదేం బ్యాటింగ్? నెమ్మదిగా ఆడడంపై నెటిజన్ల విమర్శలు.. ఇర్ఫాన్ పఠాన్ ఏమన్నాడంటే..
ABN, First Publish Date - 2023-04-12T08:39:48+05:30
ఐపీఎల్ (IPL 2023)లో ఢిల్లీ క్యాపిటల్స్ పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అన్ని జట్లూ కనీసం ఒక్కో విజయాన్ని అయినా నమోదు చేశాయి.
ఐపీఎల్ (IPL 2023)లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పేలవ ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు అన్ని జట్లూ కనీసం ఒక్క విజయాన్ని అయినా నమోదు చేశాయి. అయితే ఢిల్లీ టీమ్ మాత్రం 4 మ్యాచ్‌లు ఆడి ఒక్క విజయం కూడా సాధించలేకపోయింది. మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి పాయింట్ల పట్టికలో (IPL 2023 Points Table) అట్టడుగు స్థానంలో నిలిచింది. మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (MIvsDC) ఢిల్లీ జట్టు ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ (David Warner) 47 బంతుల్లో 51 పరుగులు సాధించాడు. డీసీ ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న వార్నర్ వేగంగా ఆడడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఈ ఐపీఎల్‌లో వార్నర్ స్ట్రైక్ రేట్ (Strike Rate) చాలా తక్కువగా ఉంది. ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లు ఆడిన వార్నర్ మొత్తం 209 పరుగులు చేశాడు. అతడి స్ట్రైక్ రేట్ మాత్రం 114గా నమోదైంది. ఓపెనర్ అంత తక్కువ స్ట్రైక్ రేట్‌తో ఆడడం కాస్త ఇబ్బంది కలిగించే అంశమే. దీంతో వార్నర్ బ్యాటింగ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది.
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు ఏమైంది? నెల రోజుల్లో నాలుగోసారి గోల్డెన్ డక్.. ఫ్యాన్స్ విమర్శలు
వార్నర్ చాలా స్వార్థపూరితంగా బ్యాటింగ్ చేస్తున్నాడని అభిమానులు విమర్శిస్తున్నారు. వార్నర్ నెమ్మదిగా ఆడడం వల్ల మిగతా బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి పెరిగి వారు వేగంగా ఆడే క్రమంలో అవుట్ అవుతున్నారని కొందరు కామెంట్ చేశారు. టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) కూడా వార్నర్ స్ట్రైక్ రేట్‌పై విమర్శలు చేశాడు. కొంతకాలంగా వార్నర్ చాలా నెమ్మదిగా ఆడుతున్నాడని పేర్కొన్నాడు.
Updated Date - 2023-04-12T08:39:48+05:30 IST