ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Virat Kohli: విరాట్ కోహ్లీకి భారీ జరిమానా.. మళ్లీ రిపీట్ అయితే రెండు మ్యాచ్‌లు నిషేధం!

ABN, First Publish Date - 2023-04-25T08:55:06+05:30

ఐపీఎల్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్ వరుస విజయాలతో జోరు మీదుంది. రెగ్యులర్ కెప్టెన్ గాయం కారణంగా ``ఇంపాక్ట్ ప్లేయర్``గా బరిలోకి దిగుతున్నాడు. దీంతో గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీని కోహ్లీ ముందుండి నడిపించి విజయాలు అందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐపీఎల్‌లో (IPL 2023) బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (RCB) టీమ్ వరుస విజయాలతో జోరు మీదుంది. రెగ్యులర్ కెప్టెన్ డుప్లెసిస్ గాయం కారణంగా ``ఇంపాక్ట్ ప్లేయర్``గా బరిలోకి దిగుతున్నాడు. దీంతో గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఆర్సీబీని కోహ్లీ (Virat Kohli) ముందుండి నడిపించి విజయాలు అందించాడు. అయితే గత ఆదివారం రాజస్తాన్ రాయల్స్‌తో (RR) జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనలు అధిగమించినందుకు కోహ్లీకి, టీమ్ సభ్యులకు భారీ జరిమానా (Fine) పడింది.

రాజస్థాన్ రాయల్స్‌తో (RRvsRCB) జరిగిన మ్యాచ్‌లో స్లో-ఓవర్ రేట్ (slow over-rate) ఈ జరిమానాకు కారణం. ఈ లీగ్‌లో ఆర్సీబీ టీమ్ స్లో-ఓవర్ రేట్ నమోదు చేయడం ఇది రెండోసారి. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఏకంగా రూ.24 లక్షల జరిమానా పడింది. అలాగే జట్టు సభ్యులకు రూ.6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం (రెండింటిలో ఏది ఎక్కువైతే అది) కోత విధిస్తూ మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. ఈ లీగ్‌లో మరోసారి ఈ తప్పిదం జరిగితే ఆ మ్యాచ్‌కు ఎవరు కెప్టెన్‌గా ఉంటే వారిపై రెండు మ్యాచ్‌ల వరకు నిషేధం విధించే ప్రమాదం ఉంది.

MS Dhoni: నా ఫేర్‌వెల్ కోసం వచ్చారేమో.. ఈడెన్ గార్డెన్స్‌లో అభిమాన సంద్రంపై ధోనీ సరదా వ్యాఖ్యలు..

గతంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో (LSGvsRCB) జరిగిన మ్యాచ్‌లో కూడా ఆర్సీబీ స్లో-ఓవర్ రేట్ నమోదు చేసింది. ఆ మ్యాచ్‌లో బెంగళూరు బౌలింగ్ చాలా నెమ్మదిగా సాగడంతో ఐపీఎల్ యాజమాన్యం కెప్టెన్ డుప్లెసిస్‌కు (Faf du Plessis) ఫైన్ వేసింది. అది తొలి తప్పిదం కాబట్టి రూ.12 లక్షలు ఫైన్ వేసింది. ఇక, ఈ లీగ్‌లో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ 4 మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది.

Updated Date - 2023-04-25T08:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising