Kohli vs Gambhir: కోహ్లీ, గంభీర్ మధ్య మళ్లీ ఫైట్.. బీసీసీఐ సీరియస్.. ఇద్దరికీ భారీ జరిమానా!
ABN, First Publish Date - 2023-05-02T08:31:13+05:30
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ మెంటార్ గౌతమ్ గంభీర్ మధ్య మరోసారి వివాదం చెలరేగింది. ఇద్దరూ మైదానంలోనే వాగ్వాదానికి దిగారు. ఇరు జట్ల ఆటగాళ్లూ వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు.
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli), లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (LSG) మెంటార్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) మధ్య మరోసారి వివాదం చెలరేగింది. ఇద్దరూ మైదానంలోనే వాగ్వాదానికి దిగారు. ఇరు జట్ల ఆటగాళ్లూ వారికి సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. దీంతో మ్యాచ్ అనంతరం కాస్త ఉత్కంఠ నెలకొంది. ఈ వివాదంపై ఐపీఎల్ (IPL 2023) యాజమాన్యం సీరియస్‌గా స్పందించింది. ఈ దిగ్గజ ఆటగాళ్లద్దరికీ భారీ జరిమానా విధించింది. ఇద్దరి మ్యాచ్ ఫీజ్‌ను వంద శాతం (100% match fee fine) కట్ చేసింది.
సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో (LSGvsRCB) లఖ్‌నవూపై బెంగళూరు టీమ్ 18 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. 127 పరుగులు మాత్రమే చేసినా ఆ స్కోరును అద్భుతంగా డిఫెండ్ చేసుకుంది. మ్యాచ్ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్ల షేక్ హ్యాండ్‌ల సమయంలో విరాట్ కోహ్లీ, లఖ్‌నవూ బౌలర్ నవీనుల్ హఖ్ (Naveen ul Haq) (అఫ్గానిస్తాన్) మధ్య ఏదో విషయమై వివాదం చెలరేగింది. ఇద్దరూ చేతులు విసిరికొట్టుకున్నారు. తనకేం సంబంధం లేకపోయినా గౌతమ్ గంభీర్ ఈ వివాదంలో తలదూర్చాడు.
ఈ క్రమంలో కోహ్లీ, గంభీర్ చాలా తీవ్రంగా వాదించుకున్నారు (Kohli Heated Conversation With Gambhir,). ఇతర ఆటగాళ్లు విడిపించేందుకు ప్రయత్నించినా శాంతించలేదు. చివరకు కేఎల్ రాహుల్, అమిత్ మిశ్రా వారిద్దరినీ విడిపించి దూరంగా తీసుకెళ్లారు. జరిగిన విషయం గురించి రాహుల్‌కు కోహ్లీ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై బీసీసీఐ (BCCI) సీరియస్ అయింది. కోహ్లీ, గంభీర్‌లకు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించింది.
Updated Date - 2023-05-02T08:31:13+05:30 IST